ఈ దేశానికి ‘కరోనా కాంగ్రెస్’ పట్టింది : కేసీఆర్

దేశానికి కాంగ్రెస్ కరోనా వైరస్ లా పట్టిందని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేవాల్లో కరోనా వైరస్‌పై మాట్లాడుతూ..మరోసారి కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. చైనాలో పుట్టిన కరోనా దేశదేశాలకు వ్యాపిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభావం చూపిస్తోందనీ..కానీ కరోనా విషయంలో రాష్ట్రప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.
కానీ కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటంలేదంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. దీన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారనీ..దేశానికి కాంగ్రెస్ కరోనా వైరస్ లా పట్టిందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు చేసే అర్థం పర్థం లేని అవివేకపు విమర్శలు పట్టించుకోవాల్సిన పనిలేదంటూ కొట్టిపారేసారు సీఎం.
కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మాట్లాడుతూ..రాష్ట్రంలో నిపుణులతో నిరంతరం సమీక్షలు చేస్తూ అప్రమత్తంగా ఉన్నామని ప్రజలు ఏమాత్రం భయపడాల్సిన పనిలేదని సీఎం భరోసానిచ్చారు. కరోనా విషయంలో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కేబినెట్ లో కూడా దీనిపై చర్చించి మరింతగా జాగ్రత్తలు తీసుకుంటామని ఎట్టి పరిస్థితుల్లోను కరోనాను కట్టడి చేసిన ప్రజల్లో భయాందోళనలకు పోగొడతామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు. ఆరోగ్యశాఖా మంత్రి ఎప్పటికప్పుడు కరోనా విషయంపై చర్చలు జరుపుతూ..ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షలు చేస్తున్నారనీ సీఎం తెలిపారు.
Also Read | అన్ని కార్పోరేషన్లలో స్కూల్స్, థియేటర్లు మూసివేత ? కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం
కరోనా నియంత్రణకు జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులను గమనిస్తున్నామని చెప్పారు. నియంత్రణకు కేంద్రంతో పాటు ఆయా రాష్ర్టాలు కూడా అప్రమత్తమయ్యాయి. అన్ని రాష్ర్టాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపిన సీఎం కేసీఆర్ కరోనాపై రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు కోసం అవసరమైతే రూ.5 వేల కోట్లు ఖర్చే చేస్తామని తెలిపారు. ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుందని..వైద్య అధికారులను అప్రమత్తం చేశామని చెప్పారు.