హైదరాబాద్ లో రూ.8 కోట్లు స్వాధీనం
పార్లమెంట్ ఎన్నికలకు తొలి విడత పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ హైదరాబాద్ లో పోలీసులు భారీగా నగదును పట్టుకున్నారు.

పార్లమెంట్ ఎన్నికలకు తొలి విడత పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ హైదరాబాద్ లో పోలీసులు భారీగా నగదును పట్టుకున్నారు.
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు తొలి విడత పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ హైదరాబాద్ లో పోలీసులు భారీగా నగదును పట్టుకున్నారు. నారాయణగూడ ఫ్లై ఓవర్ దగ్గర కారులో తరలిస్తున్న 8 కోట్ల రూపాయలను నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also : Paytm మాల్ ప్లాన్ : 300 మంది ఉద్యోగులు కావాలి
ఈ సందర్భంగా డబ్బు తరలిస్తున్న ఒక జాతీయ పార్టీ కి చెందిన కార్యాలయ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జాతీయ పార్టీకి చెందిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరకు బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసినట్లు అతను వెల్లడించారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.
బ్యాంక్ నుంచి తీసుకువస్తున్న ఈ 8 కోట్ల రూపాయలకు ఆధారాలు ఉన్నాయా.. ఎందుకు డ్రా చేశారు.. ఆ డబ్బు ఆ పార్టీ ఖాతా నుంచే డ్రా చేశారా లేక.. ఇతర ఖాతాల నుంచి డ్రా చేశారా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఒకరి నుంచే 8 కోట్ల రూపాయలు పట్టుబడటం హైదరాబాద్ సిటీలో ఇదే కావటం విశేషం.
Read Also : రేపటి రౌడీలు : కత్తులతో కేక్ కట్ చేసిన స్టూడెంట్స్