టీడీపీ ఖాళీ: ఆ ఒక్కరు కూడా గుడ్‌బై చెప్పేశారు

గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి నెగ్గిన తెలుగుదేశం పార్టీ ఏకైక కార్పొరేటర్ మందడి శ్రీనివాస్ రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు. కార్పొరేటర్ పదవితో పాటు టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోనున్నట్లు వెల్లడించిన ఆయన.. రాష్ట్రంలో టీడీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయకపోవడం తనను బాధించిందని అన్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమైందని అందుకే పార్టీకి దూరమవుతున్నట్లు తెలిపారు.
తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి పోటీ చేసేందుకు మందాడి శ్రీనివాస్ సిద్దం అవగా నందమూరి సుహాసిని రంగ ప్రవేశం చేయడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే టీఆర్‌ఎస్‌లో చేరతారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కూడా కలిశారు. కానీ ఊహించని విధంగా ఆయన పూర్తిగా రాజకీయాలు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. 2016లో జరిగిన గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో కేపీహెచ్‌బీ డివిజన్ కార్పొరేటర్‌గా మందడి గెలిచారు. అనంతరం ఆయనకు టీఆర్‌ఎస్ నుంచి పలుమార్లు ఆఫర్లు వచ్చినా వెళ్లలేదు.