కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు – హరీష్‌కు ఆర్థిక శాఖ

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా చోటు దక్కించుకున్న ఆరుగురికి శాఖలు కేటాయించారు. హరీష్ రావుకు ఆర్థిక శాఖను కేటాయించారు. ఈ శాఖ సీఎం కేసీఆర్ వద్దనున్న సంగతి తెలిసిందే. నీటి పారుదల చాలా కీలకం కాబట్టి..ఈ శాఖను సీఎం కేసీఆర్ తనవద్దే ఉంచుకున్నారు.
శాఖల కేటాయింపుల్లో సీఎం కేసీఆర్ మార్కును చూపించారు. సెప్టెంబర్ 08వ తేదీ ఆదివారం సాయంత్రం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డిల శాఖలను మార్చారు. వేముల వద్దనున్న రవాణా శాఖను తొలగించి పువ్వాడ అజయ్‌కు, జగదీశ్వర్ రెడ్డి చూసున్న విద్యాశాఖను సబితా ఇంద్రారెడ్డికి కేటాయించారు. జగదీశ్వర్ రెడ్డికి విద్యుత్ శాఖను కేటాయించారు.
> టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, మైనింగ్, ఐటీ శాఖలు.
> సత్యవతి రాథోడ్ – గిరిజన, మహిళా సంక్షేమ శాఖ.
> గంగుల కమలాకర్ – బీసీ సంక్షేమం, పౌర సరఫరాలు.
> పువ్వాడ అజయ్ – రవాణాశాఖ.
> సబితా ఇంద్రారెడ్డి – విద్యా శాఖ.
> జగదీశ్వర్ రెడ్డి శాఖను మార్పు చేశారు. విద్యుత్ శాఖను కేటాయించారు. ఆయన విద్యాశాఖను చూస్తున్న సంగతి తెలిసిందే.
> అలాగే వేముల ప్రశాంత్ రెడ్డి నుంచి రవాణా శాఖను తొలగించారు.
> సీఎం కేసీఆర్ వద్దనున్న శాఖలు : రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్, లా & ఆర్డర్, ప్లానింగ్, జీఏడీ.
కొంతమందికి ఉద్వాసన పలకాలని అనుకున్నారు. దీనిపై సీఎం కేసీఆర్..కీలక నేతలు, సన్నిహితులతో సుదీర్ఘంగా చర్చించారు. కానీ..త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉద్వాసన పెండింగ్‌లో పెట్టాలని అనుకున్నట్లు తెలుస్తోంది.