వదలిపెట్టం, రంగారెడ్డి జిల్లాలో భూఆక్రమణలపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం
రంగారెడ్డి జిల్లాలో భూఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. గంధంగూడలో 3.22 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. భూ

రంగారెడ్డి జిల్లాలో భూఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. గంధంగూడలో 3.22 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. భూ
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి భూదందా వ్యవహారం శాసనమండలిని తాకింది. రేవంత్ భూ ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. దీనిపై మండలిలో మాట్లాడిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి… భూదందాకు పాల్పడిన వారెవరినీ వదిలిపెట్టబోమన్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. గోపన్‌పల్లిలో రేవంత్ భూదందాను మండలిలో ప్రస్తావించారు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్. దళితుల భూములు ఆక్రమించిన రేవంత్‌రెడ్డిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు, క్రిమినల్ కేసు, భూ ఆక్రమణ కేసులు పెట్టాలని కోరారు. కబ్జా చేసిన భూమిని దళితులకు తిరిగి ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు. దీనికి మంత్రి ప్రశాంత్‌రెడ్డి సమాధానమిచ్చారు.
రంగారెడ్డి జిల్లాలో భూఆక్రమణలపై ప్రభుత్వం స్పందించింది. గంధంగూడలో 3.22 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. గోపనపల్లి భూదందాపైనా త్వరలోనే స్పందిస్తామన్నారు. ఈ మేరకు గురువారం(మార్చి 12,2020) శాసన మండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రకటన చేశారు.
65 బహుళ అంతస్తుల నిర్మాణాలు జరిగాయని తెలిపిన మంత్రి కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామన్నారు. భూఆక్రమణల వ్యవహారం ప్రభుత్వం దృష్టిలో ఉందని, కోర్టులో కేసు నడుస్తోందని, ఇప్పటికే పూర్తి విచారణకు ఆదేశించారని, రెవెన్యూ శాఖ కూడా ప్రాథమిక రిపోర్టు ఇచ్చిందని మంత్రి తెలిపారు. భూఆక్రమణలతో పాటు అక్రమ కట్టడాల అంశంపైనా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.
రేవంత్ సోదరులపై భూఆక్రమణ ఆరోపణలు:
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు దళితుల భూమిని కబ్జా చేశారని ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు ఆరోపించారు. దళితుల భూమి వారికే ఇప్పించాలన్నారు. భూమిని కబ్జా చేసిన వారిపై అట్రాసిటీ కేసు పెట్టాలని ప్రభాకర్ రావు డిమాండ్ చేశారు. కబ్జా చేసిన భూమిని ఎప్పటిలోగా అప్పగిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోరారు.
భూఆక్రమణదారులపై అట్రాసిటీ కేసులు పెట్టాలి:
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి భూఆక్రమణ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గోపనపల్లిలో రేవంత్ రెడ్డి సోదరులు దళితులకు చెందిన భూమిని కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కోర్టులో కేసు నడుస్తోంది. భూఆక్రమణలు నిజమే అని రెవెన్యూ అధికారులు నివేదిక ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో భూఆక్రమణలు జరిగాయి. దీంతో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ శాసనమండలిలో ప్రశ్న రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ సోదరులు దళితుల భూములు లాక్కున్నారని, దీనిపై సమగ్రంగా విచారణ జరిపించి, న్యాయపరంగా రేవంత్ సోదరులను శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. దళితులను బెదిరించి వారి భూములు లాక్కున్న వారిని వదిలిపెట్టొద్దన్నారు.
భూఆక్రమణలపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని మంత్రి చేసిన ప్రకటనతో భూఆక్రమణలకు పాల్పడిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎలాంటి శిక్ష పడుతుందోనని వర్రీ అవుతున్నారు.