నేటి నుండి పరిషత్ నామినేషన్ల స్వీకరణ

  • Published By: madhu ,Published On : April 22, 2019 / 02:29 AM IST
నేటి నుండి పరిషత్ నామినేషన్ల స్వీకరణ

Updated On : April 22, 2019 / 2:29 AM IST

తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత నిర్వహించే ZPTC, MPTC ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 22వ తేదీ సోమవారం నుండి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఉదయం 10గంటలకు ఆయా ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాతో పాటు తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. సాయంత్రం 5 గంట వరకు MPDO కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. 

తొలి విడత ఎన్నికల్లో భాగంగా 197 జడ్పీటీసీ, 2 వేల 166 ఎంపీటీసీ స్థానాలకు మే 6న ఎన్నికలు జరునున్న సంగతి తెలిసిందే. జడ్పీటీసీ జనరల్, బీసీ అభ్యర్థులకు రూ. 5వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 2 వేల 500, ఎంపీటీసీ జనరల్, బీసీ అభ్యర్థులకు రూ. 2 వేల 500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 1, 250 డిపాజిట్ రుసుంగా తీసుకుంటారు. 

* ఏప్రిల్ 24వ తేదీ నామినేషన్లకు తుది గడువు.
* ఏప్రిల్ 25న పరిశీలన చేయనున్నారు.
* ఏప్రిల్ 25వ తేదీ సాయంత్రం 5గంటలకు అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రచురణ.
* ఏదైనా అభ్యంతరాలకు ఏప్రిల్ 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు అవకాశం.
* ఏప్రిల్ 27 సాయంత్రం 5 గంటల వరకు అప్పీల పరిశీలన.
* వీటిని పరిష్కరించిన అనంతరం నామినేషన్ల ఉపసంహరణ గడువు ఏప్రిల్ 28వ తేదీ మూడు గంటల వరకు . 
* ఏప్రిల్ 28వ తేదీ పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటన.
* మే 6వ తేదీ ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్.