త్వరలో హైదరాబాద్ లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు : మరో రెండు అనుమానిత కేసులు

హైదరాబాద్ లో త్వరలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రయత్నాలను అధికారులు చేపట్టారు.

  • Published By: veegamteam ,Published On : January 31, 2020 / 06:22 AM IST
త్వరలో హైదరాబాద్ లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు : మరో రెండు అనుమానిత కేసులు

Updated On : January 31, 2020 / 6:22 AM IST

హైదరాబాద్ లో త్వరలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రయత్నాలను అధికారులు చేపట్టారు.

హైదరాబాద్ లో త్వరలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రయత్నాలను అధికారులు చేపట్టారు. గురువారం (జనవరి 30, 2020) నగరంలో మరో రెండు కరోనావైరస్ (2019-nCoV) అనుమానిత కేసులు నమోదు అయ్యాయి. ఆ ఇద్దరు విద్యార్థులు ఇటీవలే చైనాలోని వుహాన్ నగరం నుంచి వచ్చారు. అయితే విద్యార్థుల్లో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నప్పటికీ వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. 

తొమ్మిది మంది అనుమానిత కేసులకు సంబంధించిన నమూనాల నివేదికలను అధికారులు పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి) పంపారు. నిర్ధారణ పరీక్షల కోసం రాష్ట్ర అధికారులు ఎదురుచూస్తున్నారు. ఇదిలావుంటే హైదరాబాద్ లో మూడు రోజుల్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. అప్పుడు అనుమానితుల నమూనాలను పూణేకు పంపడం మానేస్తారు. 

కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం రాష్ట్రానికి వస్తు సామగ్రిని పంపడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు రాష్ట్ర నోడల్ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు రాష్ట్రానికి కిట్స్ ఇవ్వడానికి కేంద్రం అంగీకరించినట్లు ఆయన తెలిపారు. రెండు, మూడు రోజుల్లో గాంధీ ఆస్పత్రి ఐసీఎమ్ ఆర్ ల్యాబ్ లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఇప్పటికీ అనుమానితుల నమూనాలను పూణె పంపుతున్నామని చెప్పారు. 

కిట్స్ రాష్ట్రానికి వచ్చాక.. ఒక పరీక్ష ఇక్కడ చేసి, వాటికి సంబంధించిన నమూనాలను పుణెకు పంపుతామని తెలిపారు. ఒకవేళ పూణేలోని ఎన్ ఐవి అధికారులు హైదరాబాద్ లోనే కరోనా పరీక్షలు చేయడానికి అనుమతిస్తే శాంపుల్స్ ను పుణెకు పంపడం మానేస్తామని, నగరంలోనే నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఫీవర్ ఆస్పత్రిలో చేరిన 7 మంది అనుమానితులు కరోనా వైరస్ లక్షణాలు తగ్గాయని చెప్పడంతో వారిని డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు.

ఐడీఎస్ పీ బృందాలు ఇచ్చిన భరోసాతో వారు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. అయితే అనుమానిత రోగులకు ఇంటి దగ్గర ఒంటరిగా ఉండాలని, సంబంధిత జిల్లా వైద్య ఆరోగ్య అధికారులకు సమాచారం ఇస్తారని, రోగుల ఇళ్ళ వద్ద వారిని పర్యవేక్షిస్తారని తెలిపారు.