వీధుల్లో పెడుతున్నారు : ఈ మెషీన్ ఉంటే.. దోమలు వచ్చి చచ్చిపోతాయి

వర్షా కాలం మొదలైన నాటి నుంచి రాష్ట్రంలో పలువురు విష జ్వరాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. డెంగ్యూ ప్రభావంతో చాలా మంది ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. వీటన్నిటికీ చెక్ పెట్టేలా GHMC దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనుంది. ఇప్పటి వరకూ దోమలను తరమికొట్టేందుకు ఫాగింగ్ వంటి చర్యలు చేసినా.. దాని కంటే అడ్వాన్స్‌గా మరో అడుగేసింది.
అమెరికాలో తయారైన ప్రత్యేక పరికరాన్ని దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అమర్చుతారు. దీని సహాయంతో దోమలు ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది దాంతో పాటే ఇందులో ఉండే ప్రత్యేక పరికరం వాటిని ఆకర్షిస్తుంది. ఇక తర్వాత దొరికిన దోమలను ఊరికే వదులుతారా అంతే నాశనమే.
జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎష్ లోకేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఇన్నాళ్లు తీసుకున్న చర్యలన్నిటికంటే ఇది బలమైనది. ఫాగింగ్, యాంటీ లార్వాల కోసం ఆపరేషన్లు ఒక ఎత్తైతే ఇది ఇంకా ఎక్కువ. దోమల ప్రభావంతో డెంగ్యూ, జికా, ఎన్సిఫలిటీస్( బ్రెయిన్ ఫీవర్), చికెన్ గున్యా, మలేరియా, ఫిలిరియాసిస్‌లు వస్తున్నాయి. ఇప్పటి వరకూ అందిన ఫలితాల ఆధారంగా మూలాల నుంచి అడ్డుకుంటేనే వ్యాధులు సరిగ్గా నిరోధించగలమని అనుకుంటున్నాం’ అని అన్నారు.
‘ఈ డివైజ్‌ల చుట్టూ అంటే 500మీటర్ల వ్యాసార్థం వరకూ ఉన్న దోమలను ఈ పరికరాలు ఆకర్షిస్తాయి. అందులో ఉంచిన ఒక బాక్సులో వచ్చి చిక్కుకుపోతాయి. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వీటిని ఏర్పాటు చేయనున్నాం. క్రమంగా నగరమంతా వీటిని అమరుస్తాం’ అని జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు తెలిపారు.