ఎన్నికల ప్రచారంలో TRS NRI వింగ్
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన TRS NRI వింగ్ పార్లమెంట్ ఎలక్షన్ సమయంలోనూ రంగంలోకి దిగింది. పార్టీ తరఫున ప్రచారం ప్రారంభించేసింది.

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన TRS NRI వింగ్ పార్లమెంట్ ఎలక్షన్ సమయంలోనూ రంగంలోకి దిగింది. పార్టీ తరఫున ప్రచారం ప్రారంభించేసింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన TRS NRI వింగ్ పార్లమెంట్ ఎలక్షన్ సమయంలోనూ రంగంలోకి దిగింది. పార్టీ తరఫున ప్రచారం ప్రారంభించేసింది. వివిధ దేశాల్లో ఉన్న పార్టీ కార్యకర్తలు అభిమానులు పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓటేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. సుమారు 40 దేశాల్లో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ బ్రాంచులున్నాయి. వాటిలో కీలకంగా ఉన్న నేతలు.. తెలంగాణకు చేరుకున్నారు. ఇతర దేశాల్లో ఉన్న వారి వివరాల ఆధారంగా.. వారి కుటుంబీకులపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు.
గల్ఫ్ సమస్య పరిష్కరించడంలో TRS ప్రభుత్వం చొరవ చూపించింది. ఈ విషయాన్ని వారి కుటుంబాలను నేరుగా కలుసుకుని ఎన్‌ఆర్ఐ టీమ్ వివరిస్తోంది. టీఆర్ఎస్‌కు ఓటేయాల్సిన అవశ్యకతను గుర్తుచేసింది. ఇక.. సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువగా ఉండటంతో… ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరువ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా… కారు క్లీన్ స్వీప్ చేయడం గ్యారెంటీ అని టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ వింగ్ ధీమా వ్యక్తం చేస్తోంది. 16 ఎంపీ స్థానాల విజయం కోసం తాము సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తామని.. ఆ విభాగం చెబుతోంది. ఎన్ఆర్ఐ వింగ్ చేసే ప్రచారం ఈ ఎన్నికల్లో ప్లస్ అవుతుందని పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : మే 23 తర్వాత : కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయం