చర్చలకు పిలవండి : ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణ

చర్చలకు పిలవాలని మరోసారి కోరింది ఆర్టీసీ జేఏసీ. ప్రభుత్వంలో ఆర్టీస విలీనం అనే ప్రధానమైన డిమాండ్‌ను తాత్కాలికంగా పెట్టినట్లు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కీలక ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మిగతా డిమాండ్లపై తమను చర్చలకు పిలవాలని మరోసారి కోరారు. సమ్మె మాత్రం కొనసాగుతుందని, ప్రభుత్వ వైఖరి చెప్పకుంటే..సమ్మెను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. నవంబర్ 14వ తేదీ గురువారం వివిధ పక్షాల నేతలతో ఆర్టీసీ జేఏసీ సమావేశమైంది. భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం అశ్వత్థామ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
> ఆర్టీసీని రక్షించాలంటూ నవంబర్ 15వ తేదీ శుక్రవారం బైక్ ర్యాలీ.
> నవంబర్ 16వ తేదీ శనివారం నలుగురు నిరాహార దీక్ష.
> నవంబర్ 17వ తేదీ ఆదివారం, నవంబర్ 18వ తేదీ సోమవారం అన్ని డిపోాల దగ్గర కార్మికుల సామూహిక దీక్షలు.
> నవంబర్ 19వ తేదీ మంగళవారం హైదరాబాద్ నుంచి కోదాడ వరకు సడక్ బంద్.
ఆర్టీసీ విలీనం అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు చెప్పారు. అరెస్టు చేసిన కార్మికులను విడుదల చేయాలని, ఆర్టీసీ కార్మికులతో యాజమాన్యం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఆర్టీసా కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారాయన. సురక్షితమైన ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలతో గవర్నర్‌ను కలుస్తామని..ఇందుకు అపాయింట్ మెంట్ కోరామన్నారు. అలాగే ఎన్‌హెచ్ ఆర్సీ అపాయింట్ మెంట్ కూడా కోరామన్నారు అశ్వత్థామరెడ్డి.
Read More : విలీనం డిమాండ్‌పై వెనక్కి తగ్గిన ఆర్టీసీ జేఏసీ