TSRTC JAC అల్టిమేటం : దసరా ప్రయాణికుల్లో టెన్షన్

దసరా పండుగ సమీపిస్తోంది. సెప్టెంబర్ 29వ తేదీ నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ కానున్నాయి. అక్టోబర్ 08వ తేదీన దసరా. కానీ TSRTC జేఏసీ షాక్ ఇస్తోంది. సొంతూళ్ల బాట పట్టేందుకు లక్షలాది మంది ప్రజలు సిద్ధమవుతున్న క్రమంలో కార్మిక సంఘంతో కూడిన జేఏసీ సమ్మె అల్టిమేటం జారీ చేసింది. తమ డిమాండ్లపై మూడు రోజుల్లోగా స్పందించకుంటే..సమ్మెకు దిగుతామని స్పష్టం చేసింది.
ఈ మేరకు సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం యాజమాన్యానికి లేఖ అందచేసింది. తాము సమ్మె నోటీసు ఇచ్చి 14 రోజులు గడిచాయని, తర్వాత..ఎప్పుడైనా సమ్మె చేయ్యొచ్చని వెల్లడించింది. సంప్రదింపుల సమావేశ తేదీని ఇప్పటి వరకు ప్రకటన లేకపోవడంతో..తాము మీటింగ్ ఉండదని భావించి..మూడు రోజుల తర్వాత సమ్మె ప్రారంభిస్తామని తేల్చిచెప్పారు కార్మిక సంఘాల నేతలు.
టీజేఎంయూతో కూడిన మరో జేఏసీ కూడా సమ్మె సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. ఎన్ఎంయూ గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ చేసే సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధమని ప్రకటించింది. దీనిపై ఆర్టీసీ ఇన్ ఛార్జీ ఎండీ స్పందించారు. రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని, ఆర్టీసీలో సమ్మెలపై నిషేధం ఉందనే విషయాన్ని గుర్తు చేశారు. దసరాకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read More : దంచికొట్టిన వాన : మంత్రి KTR సమీక్ష..అర్ధరాత్రి మేయర్ పర్యటన