ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ బంద్
ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బంద్ పిలుపునకు అనూహ్య మద్దతు లభించింది. టీఆర్‌ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలతోపాటు ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు బంద్‌కు

ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బంద్ పిలుపునకు అనూహ్య మద్దతు లభించింది. టీఆర్‌ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలతోపాటు ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు బంద్‌కు
ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బంద్ పిలుపునకు అనూహ్య మద్దతు లభించింది. టీఆర్‌ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలతోపాటు ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు బంద్‌కు మద్దతిచ్చాయి. శనివారం రాష్ట్ర బంద్ సంపూర్ణంగా జరిగేందుకు సహకరిస్తామని చెప్పాయి. అయితే… పలుచోట్ల పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు 15రోజులుగా సమ్మె చేస్తున్నారు. రోజుకో తీరున నిరసన తెలుపుతున్నారు. తమ ఆందోళనను తీవ్రతరం చేస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం కోర్టుకు కూడా వెళ్లారు. చర్చలు జరపాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అయినా ఇంతవరకు ఆ దిశగా అడుగులు పడలేదు. కార్మికులు ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో శనివారం(అక్టోబర్ 19,2019) తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు.
సర్కార్ వైఖరికి నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చిన ఆర్టీసీ యూనియన్లకు అనూహ్య మద్దతు లభించింది. కార్మికుల నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న విపక్ష పార్టీలు…బంద్‌కు కూడా మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐ, సీపీఎం పార్టీలు కార్మికులకు బాసటగా నిలిచాయి. ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు కూడా తమ మద్దతు ప్రకటించాయి. ప్రజలు కూడా సహకరించాలని కోరాయి.
మరోవైపు… ఆర్టీసీ సమ్మెతో ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న వేళ.. క్యాబ్ డ్రైవర్లు కూడా మెరుపు సమ్మెకు దిగారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిలుస్తూనే…తమ డిమాండ్ల సాధన కోసం ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు సమ్మె చేపట్టారు. ఓవైపు… ఆర్టీసీ బంద్, మరోవైపు క్యాబ్‌ల సమ్మెతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. అయితే.. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది… ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతుంది అనేది ఆసక్తిగా మారింది. ఆర్టీసీ జేఏసీ బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు కూడా అలర్టయ్యారు. ఇప్పటికే పలువురు నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.