141 మందికి పద్మ పురస్కారాలు : తెలంగాణకి 3, ఏపీకి 2
కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించి పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన 141 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించి పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన 141 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించి పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన 141 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. ఏడుగురికి పద్మవిభూషణ్ పురస్కారాలు, 16 మందికి పద్మభూషణ్ పురస్కారాలు, 118 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిలో 34 మంది మహిళలు ఉన్నారు. 18 మంది విదేశాలకు చెందిన వారు ఉన్నారు. 12 మంది చనిపోయిన తర్వాత పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి ఐదుగురికి ఈ అవార్డులు దక్కాయి. వారిలో పీవీ సింధుకు పద్మ భూషణ్ (తెలంగాణ), చింతల వెంకటరెడ్డి (వ్యవసాయం – తెలంగాణ), విజయసారధి శ్రీభాష్యం (తెలంగాణ – విద్యారంగం), యడ్ల గోపాల్ రావు (కళలు, ఆంధ్రప్రదేశ్), దాలవాయి చలపతిరావు (కళలు, ఆంధ్రప్రదేశ్) పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు.
పద్మవిభూషన్ అవార్డు గ్రహీతలు
జార్జ్‌ఫెర్నాండెజ్ – బిహార్
అరుణ్‌జైట్లీ – ఢిల్లీ
అనిరుద్ జగనాథ్
మేరీ కోం – మణిపూర్
ఛన్నులాల్ మిశ్రీ – ఉత్తరప్రదేశ్
సుశ్మాస్వరాజ్ – ఢిల్లీ
విశ్వేశతీర్థ స్వామీజీ ప్రజావార అధోఖాజ మత్ర ఉడుపి – కర్ణాటక
పద్మ భూషన్ అవార్డు గ్రహీతలు
ముంతాజ్ అలీ – కేరళ
సయ్యద్ ముజీమ్ అలీ – బంగ్లాదేశ్
ముజఫర్ హుస్సెన్ బెగ్ – జమ్ముకశ్మీర్
అజయ్ చక్రవర్తి – వెస్ట్‌బెంగాల్
మనోజ్‌దాస్ – పాండిచెరి
బాలక్రిష్ణదాస్ – గుజరాత్
క్రిష్ణమ్మల్ జగన్నాథ్ – తమిళనాడు
ఎస్‌సీ జమిర్ – నాగాలాండ్
అనిల్ ప్రకాశ్ జోషి – ఉత్తరఖండ్
డాక్టర్ స్తేరింగ్ లండల్ – లడక్
ఆనంద్ మహింద్రా – మహారాష్ట్ర
నీలకంఠ రామకృష్ణ మాధవ మీనన్ – కేరళ
మనోహర్ గోపాలకృష్ణ ప్రభు పారికర్ -గోవా
ప్రొఫెసర్ జగదీశ్ సేథ్ -యూఎస్‌ఏ
పీవీ సింధు – తెలంగాణ
శ్రీ వేణు శ్రీనివాసన్ – తమిళనాడు
పద్మశ్రీ అవార్డు గ్రహీతలు..
జగదీష్‌లాల్ అహుజా(పంజాబ్)- సామాజిక సేవ
మహమ్మద్ షరీఫ్(ఉత్తర ప్రదేశ్)- సామాజిక సేవ
జావేద్ అహ్మద్ తక్(జమ్మూకశ్మీర్)- సామాజిక సేవ
తులసి గౌడ(కార్ణాటక)- సామాజిక సేవ, పర్యావరణం
సత్యనారాయణ్(అరుణాచల్ ప్రదేశ్)- సామాజిక సేవ, విద్యా విభాగం
అబ్దుల్ జబ్బార్(మధ్య ప్రదేశ్)- సామాజిక సేవ
ఉషా చౌమార్(ఉత్తర ప్రదేశ్)- పారిశుద్ధ్యం
పోపట్‌దావ్ పవార్(మహారాష్ట్ర)- సామాజిక సేవ, నీటి విభాగం
అరుణోదయ్ మండల్(పశ్చిమ బెంగాల్)- వైద్య, ఆరోగ్యం
రవి కన్నన్(అసోం)- వైద్యం, అంకాలజీ విభాగం
ఎస్. రామకృష్ణన్(తమిళనాడు)- సామాజిక సేవ, దివ్యాంగుల సంక్షేమం
సుందరం వర్మ- పర్యావరణం, అడవుల పెంపకం
హరేకాలా హజబ్బా(కర్ణాటక)- సామాజిక సేవ, తక్కువ ఖర్చుతో విద్య
రాధామోహన్(ఒడిషా)- సేంద్రియ వ్యవసాయం
కుశాల్ కన్వర్ శర్మ(అసోం)- వెటర్నరీ డాక్టర్
ట్రినిటీ సాయో(మేఘాలయ)- సేంద్రీయ వ్యవసాయం
మున్నా మాస్టర్(రాజస్థాన్)- భజన కీర్తనలు, గాయకుడు
యోగి ఆరోన్(ఉత్తరాఖండ్)- తక్కువ ఖర్చుతో వైద్య సేవలు
రహీబాయి సోమా పోపరే(మహారాష్ట్ర)-సేంద్రియ వ్యవసాయం
హిమ్మట రాంభాబు(రాజస్థాన్)- సామాజిక కార్యకర్త, పర్యావరణం
ముజిక్కర్ పంకజాక్షి(కేరళ)- కళాకారిణి, తోలుబొమ్మలాట
ఏక్తా కపూర్ (సినీ పరిశ్రమ)
కంగనా రనౌత్ (సినీ పరిశ్రమ)
అద్నన్ సామి (సినీ పరిశ్రమ)
కరణ్ జోహార్ (సినీ పరిశ్రమ)