మోడీ టెర్రరిస్ట్‌లా బయపెడుతున్నాడు

  • Published By: vamsi ,Published On : March 9, 2019 / 02:10 PM IST
మోడీ టెర్రరిస్ట్‌లా బయపెడుతున్నాడు

Updated On : March 9, 2019 / 2:10 PM IST

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే, మోడీకి వేసినట్లే అని కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పును మళ్లీ చేయవద్దు అంటూ ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం శంషాబాద్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆమె..  ‘‘అన్నలారా..! అక్కలారా..! అసెంబ్లీ యుద్దం ముగిసింది.. పార్లమెంట్‌ మొదలైంది. ఇది కాంగ్రెస్‌కు, బీజేపీకి మధ్యన జరిగే యుద్ధం. అంటే రాహుల్‌గాంధీ-మోడీలకు జరిగే యుద్ధం. ప్రజాస్వామ్యం బతకాలని రాహుల్‌గాంధీ పోరాడుతుంటే, ప్రజాస్వామ్యంను ఖూనీ చేసి, మోడీ నియంతలా పాలిస్తున్నారని మండిపడ్డారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ గెలచి పాలించాలని మోడీ అనుకుంటున్నాడని అయితే అటువంటి అవకాశం ప్రజలు ఈసారి మోడీకి ఇవ్వరని అన్నారు. 
అలాగే కేసిఆర్‌ని మోడీ నడిపిస్తున్నాడని, తెరాసకు ఓటు వేస్తే భాజపాకు వేసినట్లేనన్నారు. మోడీ వేసుకునేది 10లక్షల కోటు అడిగేది ఓటు.. కానీ ఆయనకు కావాల్సింది అన్ని బ్యాంకుల్లోని నోటు. దేశం మొత్తం ముక్తకంఠంతో మోడీ వద్దని చెబుతుంది అని మోడీ టెర్రరిస్ట్‌లా కనబడుతన్నాడని, ప్రజలను  బయపెట్టడం కరెక్ట్ కాదని, ఏ సమయంలో ఏ నిర్ణయం మోడీ తీసుకుంటాడో అని ప్రజలు  బయపడుతున్నారని,  జీఎస్‌టీ, నోట్లరద్దు, పుల్వామా ఇలా ప్రతి దాని విషయంలో ప్రజల్లో భయం మొదలైందని, ఈసారి మాత్రం ఆలోచించుకుని ఓటు వేయాలని ఆమె కోరారు.