తెల్లరేషన్ కార్డుదారులకు ఉచితంగా రేషన్ బియ్యం : కేసీఆర్

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం మార్చి 31వరకు లాక్ డౌన్ ప్రకటించింది. ఆదివారం కేసీఆర్ అధ్యక్షతన అత్యున్నత సమావేశం ముగిసింది. ఈ సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.. తెల్లరేషన్ కార్డుదారులకు ఉచితంగా రేషన్ బియ్యం ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
12 కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇస్తామన్నారు. తెల్లరేషన్ కార్డుదారులకు నెలరోజులుకు సరిపడా రేషన్ బియ్యాన్ని అందించనుంది. ప్రతిమనిషికి 12కేజీల వరకు ఉచితంగా బియ్యం అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 87.59 లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులు ఉన్నారు. ఈ తెల్లరేషన్ కార్డుదారులకు రూ.1500 వరకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.
అత్యవసర సర్వీసులు తప్ప మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదన్నారు. 20 శాతం ఉద్యోగులు మాత్రమే రొటేషన్ పద్ధతిలో విధులకు హాజరవుతారని తెలిపారు. తెలంగాణలో దురదృష్టవశాత్తూ ఆదివారం ఒక్కరోజే 5 వరకు పాజిటీవ్ కేసులు నమోదైనట్టు తెలిపారు.
నిత్యావసరాల కోసం కుటుంబం నుంచి ఒకరిని మాత్రమే అనుమతిస్తామన్నారు. లాక్ డౌన్ తో నిరుపేదలు ఆదాయం కోల్పోతారని చెప్పారు. నిరుపేదలు ఆకలికి గురికాకూడదన్నారు. ప్రైవేటు ఉద్యోగులకు ఈ సెలవుల కాలానికి కంపెనీలు వేతనాలు చెల్లించాలన్నారు.
See Also | మార్చి 31 వరకు గడప దాటోద్దు : సీఎం కేసీఆర్