గుడి, ట్రస్టు కోసం.. దేవుడ్ని చంపేశారు

గుడి, ట్రస్టు కోసం.. దేవుడ్ని చంపేశారు

Updated On : February 16, 2021 / 7:24 PM IST

God killed: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దేవుడి భూమి లాక్కునేందుకు కుయుక్తులు పన్నారు. లక్నోలోని కుష్మారా గ్రామం మోహన్‌లాల్ గంజ్ ప్రాంతానికి చెందిన గుడికి సంబంధించిన విషయమిది. నిజానికి 100ఏళ్ల నాటి పురాతన దేవాలయం దేవుళ్లు శ్రీకృష్ణుడు – రాముడు పేరిట రిజిష్టర్ అయింది. అప్పటి నుంచి ఓ ట్రస్టు బాధ్యతలు నిర్వర్తిస్తుంది.

కొద్ది రోజుల తర్వాత ల్యాండ్ రిజిష్ట్రేషన్ వివరాల్లో దేవుళ్లు శ్రీకృష్ణుడు – రాముడికి తండ్రిని నేను అని ఓ గయా ప్రసాద్ అనే వ్యక్తి పేరు రాయించుకున్నాడు. అలా అయిన సంవత్సరాల తర్వాత 1987లో దేవుడి చనిపోయాడని డిక్లేర్ చేసేసి మొత్తం ట్రస్టును.. గుడిని తన పేరుకు మార్పించేసుకున్నాడు తండ్రి(గయా ప్రసాద్).

1991లో గయా ప్రసాద్ కూడా చనిపోవడంతో ట్రస్ట్ అతని సోదరులు రామ్‌నాథ్, హరిద్వార్ ల పేరిట ట్రాన్స్‌ఫర్ అయింది. 2016లో ఆ గుడి ఒరిజినల్ ట్రస్టీ ముందుకొచ్చి తహసీల్దార్‌కు కంప్లైంట్ చేశారు. అది కాస్తా జిల్లా మెజిస్ట్రేట్ నుంచి డిప్యూటీ చీఫ్ మినిష్టర్ ఆఫీస్ కు ఫార్వార్డ్ అయింది.

అప్పుడు మొదలైంది ఇన్వెస్టిగేషన్.. ఎస్డీఎమ్ ప్రఫుల్లా త్రిపాఠీ విచారణ చేపట్టారు. ఎవరో డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసి 0.730హెక్టార్ల పరిధిలో ఉన్న ట్రస్టును, గుడిని లాక్కోవాలని ప్రయత్నిస్తున్నట్లు తేలింది. గతంలో ఇది దేవుళ్లు అయిన కృష్ణుడు – రాముడు పేరిట రిజిష్టర్ అయి ఉందని.. తెలుసుకున్నాడు.

పైగా ఆ స్థలమంతా గ్రామ సభకు చెందినదని.. గుడి కోసం కేటాయించినదంతా బంజరు భూమిగా ప్రకటించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎస్డీఎమ్ కోర్టుకు వెళ్లగా ట్రయల్ దశలో ఉంది.