రైతుల రుణమాఫీకి రూ.12వేల కోట్లు విడుదల చేసిన తమిళనాడు

రైతుల రుణమాఫీకి రూ.12వేల కోట్లు విడుదల చేసిన తమిళనాడు

Updated On : February 5, 2021 / 4:30 PM IST

Loan Waiver: తమిళనాడు ప్రభుత్వం రుణమాఫీ చేసేందుకు గానూ.. రూ.12వేల 110కోట్లు ప్రకటించింది. కోఆపరేటివ్ బ్యాంకుల్లో 16.43లక్షల రైతులు లబ్ధి పొందనున్నట్లు వెల్లడైంది. రాష్ట్ర అసెంబ్లీ వేదికగా సీఎం కే పళనిస్వామి అనౌన్స్ చేశారు. స్కీం వెంటనే అమల్లోకి రానున్నట్లు ఈ మేర కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు.

చేసిన వాగ్దానాలను నెరవేర్చేది కేవలం ఏఐఏడీఎంకే పార్టీ ఒక్కటేనని తాజా సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ అన్నారు. ప్రతిపక్ష పార్టీ డీఎంకేను టార్గెట్ చేస్తూ.. వారంతా రెండెకరాల వ్యవసాయ భూమిని ఇస్తామని చేసిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోలేక విఫలమైనట్లు తెలిపారు.