Bjp On SC judgment: పెద్దనోట్ల రద్దుపై ‘సుప్రీం’ తీర్పు వేళ బీజేపీ స్పందన.. రాహుల్ క్షమాపణ చెబుతారా? అని ప్రశ్న

Ravi Shankar Prasad
Bjp On SC judgment: పెద్దనోట్ల రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వడంతో దీనిపై బీజేపీ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ, ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇప్పుడు రాహుల్ క్షమాపణ చెబుతారా? అని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. నల్లధనాన్ని పోగేసిన శక్తులను కాంగ్రెస్ పార్టీ కాపాడే ప్రయత్నం చేసిందని అన్నారు.
పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ బాగానే జరిగిందని సుప్రీంకోర్టు సమర్థించిందని, కాంగ్రెస్ పార్టీ మాత్రం పెద్ద నోట్ల రద్దుపై పదే పదే ప్రశ్నించిందని చెప్పారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిన సమయంలోనూ పెద్ద నోట్ల రద్దు విషయాన్ని లేవనెత్తారని, ఈ తీరు దురదృష్టకరమని అన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు భారీగా జరుగుతున్నాయని చెప్పారు. గత ఏడాది అక్టోబరులో రూ.12 లక్షల కోట్ల డిజిటల్ చెల్లింపులు జరిగాయని అన్నారు.
పేదలు కూడా నగదు రహిత చెల్లింపులు చేస్తున్నారని ఆయన చెప్పారు. ఇది పెద్ద నోట్ల రద్దు వల్ల వచ్చిన ఫలితం అని చెప్పుకొచ్చారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించిందని అన్నారు. అలాగే, జమ్మూకశ్మీర్ లో రాళ్లు విసిరే ఘటనల నిలుపుదల జరిగిందని, పీఎఫ్ఐ బ్యాంకు ఖాతాలను స్తంభించజేశామని, ఉగ్రవాదులకు ఆర్థికంగా సాయపడుతున్న వారి వెన్నెముక విరిగిందని చెప్పారు.
Chinthamaneni Prabhakar : DSPపై DGPకి ఫిర్యాదు చేసిన చింతమనేని ప్రభాకర్