క్రికెటర్‌కి కరోనా.. నాకే ఎందుకిలా? అంటూ భావోద్వేగం

  • Published By: vamsi ,Published On : May 8, 2020 / 07:59 AM IST
క్రికెటర్‌కి కరోనా.. నాకే ఎందుకిలా? అంటూ భావోద్వేగం

Updated On : May 8, 2020 / 7:59 AM IST

కరోనా ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన ఈవెంట్లను ఇప్పటికే ఆపేసింది. ప్రపంచదేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారి లేటెస్ట్‌గా ఓ క్రికెటర్‌కి సోకింది. సౌతాఫ్రికా ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయిన సోలో నిక్వెనీ కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఇప్పటికే ‘గులైన్​ బారే సిండ్రోమ్(జీబీఎస్‌)‌’ అనే నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సోలోకి లేటెస్ట్‌గా కరోనా పాజిటివ్ అని తేలింది. 

కొద్ది రోజలుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో నిక్వెనీ పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలోనే నిక్వెనీకి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు పరీక్షల్లో వచ్చింది. దీంతో కరోనా బారిన పడ్డ మూడో క్రికెటర్​గా సోలో నిలిచాడు. అంతకు ముందు పాకిస్తాన్ క్రికెటర్​ జాఫర్​ సర్ఫరాజ్​, స్కాట్​లాండ్ క్రికెటర్ మజిద్ హక్‌కు కరోనా వచ్చింది. 

Also Read | Coronavirus, Spanish fluను ఎదిరించిన 107ఏళ్ల మహిళ

అయితే తనకు కరోనా రావడంపై ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన సోలో భావోద్వేగానికి గురయ్యాడు. గతేడాది నాకు జీబీఎస్​కు వచ్చింది. పది నెలలుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా. దాదాపు సగం కోలుకున్నా. టీబీ వచ్చింది, మూత్రపిండాలు, కాలేయం పాడయ్యాయి. ఇప్పుడు కరోనా వైరస్ పాజిటివ్​గా తేలింది. నాకే ఇదంతా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు సోలో.

నిక్వెనీ 2012లో దక్షిణాఫ్రికా అండర్‌-19 టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. గతంలో ఈస్ట్రెన్‌ ప్రావిన్స్‌, వారియర్స్‌ ప్రాంచైజీలతో ఒప్పందం కుదుర్చుకుని ఉన్నాడు. ప్రస్తుతం నిక్వెనీ అడేర్​బీర్​ షైర్ క్లబ్​ తరఫున ఆడుతున్నాడు.

Also Read | క్రీడాకారులకు, ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆట మళ్లీ మొదలైంది