Argentina : అర్జెంటీనాలో తుఫాన్ బీభత్సం… భవనం పైకప్పు కుప్పకూలి 13 మంది మృతి
భారీ వర్షాలు, తీవ్ర గాలులు బాహియా బ్లాంకాను ఢీకొట్టడంతో స్కేటింగ్ పోటీ జరుగుతున్న ప్రదేశంలో పైకప్పు కూలిపోయింది. నగరంలో గంటకు 140 కిలో మీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తున్నాయి.

Argentina Storm
Argentina Storm : అర్జెంటీనాలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. తుఫాన్ ధాటికి భవనం పైకప్పు కుప్పకూలి 13 మంది మృతి చెందారు. భీకర తుఫాన్ కు స్పోర్ట్స్ క్లబ్ పైకప్పు కూలిపోయింది. మేయర్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం భారీ వర్షాలు, తీవ్ర గాలులు బాహియా బ్లాంకాను ఢీకొట్టడంతో స్కేటింగ్ పోటీ జరుగుతున్న ప్రదేశంలో పైకప్పు కూలిపోయింది. నగరంలో గంటకు 140 కిలో మీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు సరఫార నిలిచిపోయింది.
దురదృష్టవశాత్తూ బహియన్స్ డెల్ నోర్టే క్లబ్‌లో ఉన్న 13 మంది మృతి చెందినట్లు అత్యవసర సేవ తెలిపినట్లు మున్సిపాలిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు.