New Zealand Women : ఎంత అమానుషం.. లావుగా ఉన్నారని ఇద్దరు మహిళలను ఫ్లైట్ నుంచి దించేశారు!

New Zealand Women : ఈ నెల ప్రారంభంలో న్యూజిలాండ్‌కు చెందిన ఇద్దరు మహిళలు నేపియర్ నుంచి ఆక్లాండ్‌కు ప్రయాణిస్తున్న సమయంలో ఈ అమానుష సంఘటన చోటుచేసుకుంది.

New Zealand Women : ఎంత అమానుషం.. లావుగా ఉన్నారని ఇద్దరు మహిళలను ఫ్లైట్ నుంచి దించేశారు!

2 New Zealand Women Claim They Were Kicked Off Flight Because Of Their Size

Updated On : March 19, 2024 / 7:00 PM IST

New Zealand Women : లావుగా ఉన్నారనే కారణంతో న్యూజిలాండ్‌కు చెందిన ఇద్దరు మహిళలను అమానుషంగా విమానంలో నుంచి కిందికి దించేశారు. ఈ ఘటన న్యూజిలాండ్‌‌లో చోటుచేసుకుంది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. ఏంజెల్ హార్డింగ్ అనే మహిళ ఈ నెల ప్రారంభంలో న్యూజిలాండ్ విమానంలో మరో ఇద్దరు మహిళలతో కలిసి నేపియర్ నుంచి ఆక్లాండ్‌కు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది.

ఏటీఆర్ రీజినల్ ప్లేన్ సర్వీస్‌లో ఒక ఫ్లైట్ అటెండెంట్ తాను కూర్చొన్న సీటు ఆర్మ్‌రెస్ట్‌లను బలవంతంగా కిందకు దింపేందుకు ప్రయత్నించిందని బాధితురాలు వాపోయింది. ఈ క్రమంలో తనకు తీవ్రంగా నొప్పి వచ్చిందని ఏంజెల్ హార్డింగ్ పేర్కొంది. అంతేకాదు.. తాము లావు తగ్గేంతవరకు పైలట్ టేకాఫ్ చేయలేరని అటెండర్ దురుసుగా ప్రవర్తించినట్టు హార్డింగ్‌ చెప్పుకొచ్చింది.

Read Also : Samsung Galaxy M55 5G : శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. భారత్‌లో లాంచ్‌కు ముందే కలర్ ఆప్షన్లు లీక్..

‘నేను షాక్‌లో ఉన్నాను. అలానే ముందుకు వెళ్లాను. కూర్చొనే అన్ని ఆర్మ్‌రెస్ట్‌లు డౌన్‌గా ఉంటే తప్ప పైలట్ టేకాఫ్ చేయలేడని ఆమె కేకలు వేసింది. అటెండర్ చాలా దురుసుగా ప్రవర్తించింది. నాకు ఏమి జరుగుతుందో నేను నమ్మలేకపోయాను’ అని పేర్కొంది. విమానం టేకాఫ్ అయ్యే సమయంలో కూర్చోవాలా అని సిబ్బందిని అడగ్గా.. మీ ఇద్దరినీ ఈ ఫ్లైట్ నుంచి బయటకు పంపగలనని చెప్పినట్టు తెలిపింది. ఆ తర్వాత విమానంలో నుంచి  ప్రయాణికులందరినీ దింపేశారు.

ఒక్కొక్కరు రెండు సీట్లు బుక్ చేసుకోండి :
విమానంలో రీబోర్డుకు అనుమతించలేదని హార్డింగ్ తెలిపింది. భవిష్యత్తులో ఒక్కొక్కరు రెండు సీట్లు బుక్ చేసుకోవాలని విమానంలోని అటెండర్ ఎగతాళిగా మాట్లాడిందని చెప్పింది. నా శరీర లావు నిర్మాణం కారణంగానే నన్ను దింపేసినట్టు నమ్ముతున్నానని, అదే కారణమని స్పష్టంగా చెప్పలేదని, ఇతర ప్రయాణికులకు అసౌకర్యంగా ఉందని మాత్రమే చెప్పారని హార్డింగ్ ఆవేదన వ్యక్తం చేసింది. మనమందరం మనుషులమేనని, ఇలాంటి అవమానకర పరిస్థితి ఇతరులకు ఎదురుకాకూడదని విమానయాన సంస్థకు ఫిర్యాదు చేసింది.

బాధిత మహిళలకు ఎయిర్‌లైన్ క్షమాపణలు :
ఈ క్రమంలోనే స్పందించిన ఎయిర్ న్యూజిలాండ్‌ ఇద్దరు మహిళా ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. అంతేకాదు.. వారు కొనుగోలు చేసిన టిక్కెట్ల బిల్లును కూడా చెల్లించి, వారి ఖర్చులన్నింటినీ ఎయిర్‌లైన్ కవర్ చేసింది. ఆ తర్వాత ఎయిర్ న్యూజిలాండ్ ప్రయాణికుల పట్ల హుందాగా నడుచుకోవాలని సిబ్బందికి సూచించింది. ప్రయాణికుల కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నామని తెలిపింది. కస్టమర్‌ల సమస్యలను పరిష్కరించడానికి నేరుగా వారితో కలిసి పని చేస్తూనే ఉంటామని ఎయిర్‌లైన్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

అవసరమైతే ఖాళీ సీటుతో వసతి కల్పిస్తాం :
అదనపు స్థలం అవసరమయ్యే ప్రయాణికులు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం విమానం ఎక్కే ముందుగానే తమను సంప్రదించాలని ఎయిర్ న్యూజిలాండ్ కోరింది. విమానంలో స్థలం అందుబాటులో ఉంటే.. కస్టమర్‌కు అదనపు గది అవసరమైతే.. వారి పక్కన ఖాళీ సీటుతో వసతి కల్పిస్తాయని తెలిపింది. ప్రతి కస్టమర్‌కు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం ఉండేలా పనిచేస్తున్నామని ప్రకటనలో పేర్కొంది. అయినప్పటికీ, న్యూజిలాండ్ మహిళలు తమకు పట్ల అమర్యాదగా ప్రవర్తించినందుకుగానూ పరిహారం కోరుతున్నారు.

Read Also : WhatsApp New Feature : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై ఒక నిమిషం వరకు వీడియోలను స్టేటస్ అప్‌డేట్‌గా పెట్టుకోవచ్చు!