విహారంలో విషాదం : లోయలో పడ్డ బస్సు..24మంది మృతి

  • Published By: veegamteam ,Published On : December 2, 2019 / 05:22 AM IST
విహారంలో విషాదం : లోయలో పడ్డ బస్సు..24మంది మృతి

Updated On : December 2, 2019 / 5:22 AM IST

టునీషియా దేశంలోని  ఉత్తర ప్రాంతంలో ఘోర ప్రమాదం సంభవించింది. బస్సు టునీస్ రాజధాని నగరం నుంచి పర్యాటక ప్రాంతమైన ఐన్ డ్రాహామ్ కు ఎయిన్ స్నోస్సీ  సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 24 మంది ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో  20మందికి పైగా త్రీవ గాయాలయ్యాయని పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది. 

ఈ ప్రమాదంలో బస్సు పైభాగం  పైకి లేచిపోవటంతో మృతదేహాలు లోయలో చెల్లాచెదురుగా పడిపోయాయి. మరోపక్క గాయపడినవారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. 
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక బృందం వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యల్ని చేపట్టి గాయపడినవారిని సమీపంలోని హాస్పిటల్ తరలించి చికిత్సనందిస్తున్నారు.  ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 43మంది ఉన్నట్లుగా తెలుస్తోంది.