ఉద్యోగం ఎగ్గొట్టడానికి :81 ఏళ్ల బామ్మను పెళ్లి చేసుకున్న యువకుడు

  • Published By: veegamteam ,Published On : September 29, 2019 / 08:13 AM IST
ఉద్యోగం ఎగ్గొట్టడానికి :81 ఏళ్ల బామ్మను పెళ్లి చేసుకున్న యువకుడు

Updated On : September 29, 2019 / 8:13 AM IST

నవ యువకుడు 81 సంవత్సరాల బామ్మను పెళ్లి చేసుకున్నాడు. దానికి కారణం ఏంటో తెలిస్తే కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఉద్యోగం నుంచి తప్పించుకునేందుకు అలెగ్జాండర్ కొండ్రాత్యుక్ అనే 24ఏళ్ల యువకుడు  తనకంటే..57 ఏళ్ల పైద్ద వయస్సున్న జినైడా ఇల్లారియోనోవ్నాను పెళ్లి చేసుకున్నాడు.
ఉక్రెయిన్ లో 18 సంవత్సరాలు దాటి..26 వయస్సు ఉన్న యువకులు కచ్ఛితంగా ఆర్మీలో పనిచేయాలి. ఇది ఆ దేశపు నిబంధన. ఈ నిబంధనల్లో కొన్ని సడలింపులు కూడా ఉన్నాయి. 

వివాహం అయిన యువకుడు తన భార్య వికలాంగురాలిగా ఉంటే  ఆమెను చూసుకోవటానికి సైన్యం పని చేసి తీరాలను నిబంధల నుంచి మినహాయింపు ఉంటుంది. సరిగ్గా దీన్నే ఉపయోగించుకోవాలనుకున్నాడు అలెగ్జాండర్ కొండ్రాత్యుక్. మిలటరీ విధుల నుంచి తప్పించుకునేందుకు తన బంధువైన 81 సంవత్సరాల బామ్మను పెళ్లి చేసుకున్నాడు. పశ్చిమ-మధ్య ఉక్రెయిన్ లోని విన్నట్సా నగరానికి సమీపంలో ఉన్న బెకోవ్కా గ్రామంలో నివసిస్తున్న వికలాంగురాలైన ఇల్లారియోనోవ్నాను వివాహం చేసుకున్నాడు అలెగ్జాండర్ కొండ్రాత్యుక్. 

ఈ వ్యవహారం కాస్తా అధికారులకు తెలియడంతో అతడిపై విచారణ చేపట్టారు. దీనిపై కొత్త పెళ్లి కొడుకు 24 ఏళ్ల అలెగ్జాండర్ కొండ్రాత్యుక్ మాత్రం తన బంధువైన ఇల్లారియోనోవ్నా అంటే తనకు ఎంతో ఇష్టమనీ..ఆమెపై తనకున్న ప్రేమతోనే తప్పా ..మిలటరీ విధుల నుంచి తప్పించుకునే ఉద్ధేశ్యం తనకు లేదని చెబుతున్నాడు.  ఈ విషయంపై ఇల్లారియోనోవ్నాను అధికారులు..మీడియా  ప్రశ్నించగా..ఆమెకూడా ఇదే తరహాలో సమాధానమిచ్చింది. అతడు మంచి భర్త అనీ… తనను బాగా చూసుకుంటాడని చెబుతూ మురిసిపోయింది 81 ఏళ్ల ఈ బామ్మగారు. 

విన్నట్సా కమిషనర్ డానిలియుక్ మాట్లాడుతూ..వృద్ధాప్యంలో ఉన్న వికలాంగురాలైన భార్యను చూసుకునేందుకు సంరక్షుడిగా ఉన్నాడు కాబట్టి..పైగా కొండ్రాత్యుక్ తమ ఇద్దరికీ  పెళ్లి అయినట్లుగా సర్టిఫికెట్స్ కూడా చూపించాడనీ..నిబంధలన ప్రకారం తాము ఏమీ చేయలేమని తేల్చేశారు.