2700 ఏళ్ల నాటి ఫేస్ క్రీమ్.. అప్పట్లో ఇదే రాసుకునేవారంట!

2700-year-old face cream : కొన్ని వేల యేళ్ల క్రితం ఫేస్ క్రీమ్‌లు ఎలా ఉండేవో తెలుసా? ఇప్పటి కాస్మిటిక్ ఫేస్ క్రీముల కంటే చాలా పవర్ ఫుల్ అంట.. అప్పట్లో కొందరు చైనీస్ మహానీయులు ఈ ఫేస్ క్రీములనే ఎక్కువగా వాడేవారంట.. 2700 ఏళ్ల నాటి కాస్మిటిక్ ఫేస్ క్రీముకు సంబంధించి అవశేషాలు బయటపడ్డాయి. పురావస్తు శాఖ అధికారులకు అందంగా అలంకరించిన కాంస్యపు జాడి ఒకటి బయటపడింది.
ఆ జాడిపై జంతువుల కొవ్వు, పాల గుహల నుంచి తీసిన మూన్ మిల్క్ తో కూడిన అరుదైన పదార్థం ఉన్నట్టు పురావాస్తు అధికారులు గుర్తించారు. వేల ఏళ్ల క్రితం ప్రాచీన చైనీయులు ఈ రకమైన కాస్మిటిక్స్ ఎక్కువగా వినియోగించేవారిని కనుగొన్నారు. అప్పటి చైనీస్ మహిళలు జంతువుల కొవ్వు, పాల గుహలో లభించే పదార్థంతో తయారుచేసిన ఫేస్ క్రీములనే వాడేవారని పురావాస్తు శాఖ అధికారులు ఒక అంచనాకు వచ్చారు.
2017, 2018లో బీజింగ్‌లోని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యూనివర్శిటీకి చెందిన యమిన్ యాంగ్ ఆర్కియాలిజిస్ట్, ఆయన సహచరులతో కలిసి ఫేస్ క్రీమ్ అవశేషాలపై అధ్యయనం చేశారు. పురావస్తు తవ్వకాల్లో దొరికిన జాడిపై జంతువుల కొవ్వు, పాల గుహల తెల్లటి పదార్థానికి సంబంధించి అవశేషాలను పరీక్షించారు. వీటిని కాస్మిటిక్ ఫేస్ క్రీములను తయారీకి వాడినట్టు గుర్తించారు.