Afghanistan : 450 మంది తాలిబన్లు హతం
అఫ్ఘాన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు పంజ్‌షేర్ వ్యాలీపై పట్టు సాదించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వందల సంఖ్యలో తాలిబన్లు పంజ్‌షేర్ వ్యాలీపై దాడి చేసేందుకు వెళ్తున్నారు.

Afghanistan
Afghanistan : అఫ్ఘాన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు పంజ్‌షేర్ వ్యాలీపై పట్టు సాదించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వందల సంఖ్యలో తాలిబన్లు పంజ్‌షేర్ వ్యాలీపై దాడి చేసేందుకు వెళ్తున్నారు. అయితే నార్తర్న్ అలయెన్స్ సైన్యం తాలిబన్లను తమ సరిహద్దుల్లోకి రాకముందే మట్టుబెడుతుంది. అఫ్ఘాన్ లో బలమైన నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న తాలిబన్లు పంజ్‌షేర్ వ్యాలీని మాత్రం స్వాధీనం చేసుకోలేక పోతున్నారు.
శత్రుదుర్బేధ్యమైన కొండల్లోంచి వెళ్లాలంటే తాలిబన్లు హడలిపోతున్నారు. ఇక తాలిబన్లు వచ్చే మార్గాల్లో నార్తర్న్ అలయెన్స్ బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. వీరి దాడిలో 450 మంది తాలిబన్లు హతమైనట్లు రెసిస్టెంట్ ఫోర్స్ ప్రకటించింది. పంజ్‌షేర్ లోయ లోకి ప్రవేశిస్తున్న తాలిబన్ల ట్యాంకులను నార్తర్న్ అలయెన్స్ బలగాలు పేల్చేస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. పంజ్‌షేర్‌పై పట్టు సాధిస్తునట్టు తాలిబన్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని , వాళ్లు ఒక్క అంగుంళం భూమిని కూడా స్వాధీనం చేసుకోలేదని నార్తర్న్ అలయెన్స్ ప్రకటించింది.
పంజ్‌షేర్ వ్యాలీని హస్తగతం చేసుకోవడం తాలిబన్ల వల్లకాకపోవడంతో అల్‌ఖైదాతో పాటు పాక్ ఐఎస్‌ఐ కూడా సాయం చేస్తోంది. పంజ్‌షేర్ వ్యాలీలో జరుగుతున్న పోరులో అల్‌ఖైదా టెర్రరిస్టులు తాలిబన్ల తరపున పోరాడుతున్నారు.