Taiwan Building : తైవాన్ బిల్డింగ్ లో అగ్నిప్రమాదం..46మంది మృతి
దక్షిణ తైవాన్ లోని కాహ్సియుంగ్ నగరంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో 13 అంతస్తుల భవనంలో

Taiwan
Taiwan Building దక్షిణ తైవాన్ లోని కాహ్సియుంగ్ నగరంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో 13 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించడంతో..ఆ మంటల్లో చిక్కుకుని 46 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 55 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉంది.
నివాస సముదాయంలో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసింది. అయితే భవన శిథిలాల్లో చిక్కుక్కున్న వారి కోసం ఫైర్ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేసింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియనప్పటికీ.. భవనంలోని కింది అంతస్తుల్లో అస్తవ్యస్తంగా సామగ్రి పడి ఉన్నచోటే మంటలు వ్యాపించినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
3 గంటల సమయంలో పేలుడు శబ్దం విన్నామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇది అత్యంత భయంకరమైన అగ్నిప్రమాదమని..దీని తీవ్రతకు భవనంలోని పలు అంతస్తులు ధ్వంసమయ్యాయని ఓ అధికారి తెలిపారు.40 ఏండ్ల క్రితం నిర్మించిన ఈ భవనంలోని పైఅంతస్తుల్లో కుటుంబాలు బస చేస్తుండగా, కింది అంతస్తుల్లో షాపింగ్ కాంప్లెక్స్ లు ఉన్నాయి.
ALSO READ వైన్‌తో నడిచే కారు నడుపుతున్న ప్రిన్స్ చార్లెస్..దటీజ్ రాయల్ రాజకుటుంబం రేంజ్