టెక్సాస్‌లో కాల్పులు, ఐదుగురు మృతి

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. టెక్సాస్ రాష్ట్రంలోని ఒడెస్సా ప్రాంతంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రజలపై దాడి చేశారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా,… 21మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసు సిబ్బందికి కూడా గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. పోలీసు సిబ్బంది అప్రమత్తమై బలగాన్ని దించడంతో వారిపై దాడి చేసి ఒకడ్ని షూట్ చేశారు. ఆయుధాలతో వచ్చిన మిగిలిన వారు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
దాడి చేసేందుకు టొయోటా వాహనంలో వచ్చిన దుండగులు దానిని ముందుగానే దొంగిలించారు. గుర్తు తెలియకూడదనే ఉద్ధేశ్యంతో యూఎస్ పోస్టల్ సర్వీస్ కు చెందిన వాహనం దొంగిలించి అందులో వచ్చారు. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘటనపై స్పందించారు. పూర్తి వివరాలు అందాయని ఎఫ్‌బీఐతో పాటు ఇతర సెక్యూరిటీని దర్యాప్తు మమ్మురం చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. టెక్సాస్ గవర్నర్ అబోట్ ఈ ఘాతుకాన్ని తెలివితక్కువ చర్యగా పోల్చారు. ఇలాంటి దుశ్చర్యలను టెక్సాస్ ప్రజలు ఐక్యంగా, సమర్థంగా ఎదుర్కొంటారని అభిప్రాయపడ్డారు.