Israel Palestine Conflict: గాజాలోని మరో శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం దాడి.. 50 మందికి పైగా మరణం
పేలుడులో 52 మంది ప్రాణాలు కోల్పోయారని డీర్ అల్-బలాహ్‌లోని అల్-అక్సా అమరవీరుల ఆసుపత్రి కమ్యూనికేషన్ డైరెక్టర్ మహ్మద్ అల్-హజ్ తెలిపారు. పేలుడుకు ఇజ్రాయెల్ వైమానిక దాడులే కారణమని ఆయన ఆరోపించారు

Attack On Al-Maghazi Camp: ఇజ్రాయెల్ దాడులు గాజాలో కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం హమాస్ ఉగ్రవాదులపై నిరంతరం బాంబు దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా, శనివారం (నవంబర్ 4) అర్థరాత్రి, గాజా స్ట్రిప్‌లోని అల్-మఘాజీ శరణార్థి శిబిరంలో శక్తివంతమైన బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో సుమారు 50 మంది ప్రజలు మరణించారని, పలువురు గాయపడ్డారని ఆసుపత్రి అధికారులు తెలిపారు.
తాను ఇంట్లో కూర్చొని ఉండగా ఈ దాడి జరిగిందని శివిర్ క్యాంపు నివాసి ఒకరు చెప్పారు. ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించిందట. పేలుడు భీభత్సంగా ఉండడంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఈ దాడిపై ఇజ్రాయెల్ సైన్యం వెంటనే స్పందించలేదు. పేలుడు సంభవించిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపింది.
ఇది కూడా చదవండి: Assembly Elections 2023: 60 మంది అభ్యర్థులకు బీ-ఫాం అందజేసిన కాంగ్రెస్
అల్-అక్సా అమరవీరుల ఆసుపత్రిలో నర్సింగ్ హెడ్ డాక్టర్ ఖలీల్ అల్-దక్రాన్ తనకు కనీసం 33 మృతదేహాలు చూశానని పేర్కొన్నారు. శిబిరంలోని ఓ ఇంటిపై దాడి చేసినట్లు తెలిపారు. ఈ ఇల్లు జనంతో నిండిపోయింది. ఇంట్లో నివసిస్తున్న వారిపై బాంబు దాడి చేశారు. బాధితుల్లో చాలా మంది మహిళలు, పిల్లలు ఉన్నారని తెలిపారు. ఆసుపత్రిలో అవసరమైన వస్తువులు లేకపోవడంతో ప్రజలకు వైద్యం చేయడం కష్టంగా మారిందని డాక్టర్ అల్-దక్రాన్ తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందాల్సిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారట. ఆసుపత్రిలో రోగుల సంఖ్య పడకల సంఖ్య కంటే రెట్టింపు ఉందని ఆయన చెప్పారు.
పేలుడులో 52 మంది ప్రాణాలు కోల్పోయారని డీర్ అల్-బలాహ్‌లోని అల్-అక్సా అమరవీరుల ఆసుపత్రి కమ్యూనికేషన్ డైరెక్టర్ మహ్మద్ అల్-హజ్ తెలిపారు. పేలుడుకు ఇజ్రాయెల్ వైమానిక దాడులే కారణమని ఆయన ఆరోపించారు. గాజా దక్షిణ భాగంలో ఉన్న అల్-మఘాజీ శరణార్థి శిబిరం చుట్టూ ఇరుకైన వీధులు ఉండటం, ఇక్కడ జనాభా కూడా చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం. 0.6 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ శిబిరంలో 33,000 మందికి పైగా నివసిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Israel Palestine Conflict: గాజా స్ట్రాప్ మీద అణుబాంబు వేస్తామన్న ఇజ్రాయెల్ మంత్రి.. ప్రధాని బెంజమిన్ ఏమన్నారంటే?