Philippines Earthquake : ఫిలిప్పీన్స్‌లో 6.1 తీవ్రతతో భూకంపం..

వరుస భూకంపాలతో ఇప్పటికే టర్కీ, సిరియాలు కకావికలం అయిపోయాయి. భూకంపాలతో రెండు దేశాల్లోను 41,000మందికిపైగా మరణాలు నమోదు అయ్యాయి. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. ఈక్రమంలో బుధవారం న్యూజిలాండ్‌లో భూకంపం సంభవించింది రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదైంది. ఇదిలా ఉంటే గురువారం ఫిలిప్పీన్స్‌లో భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 6.1గా నమోదైంది.

Philippines Earthquake : ఫిలిప్పీన్స్‌లో 6.1 తీవ్రతతో భూకంపం..

6.1 Magnitude Earthquake Hits Philippines

Updated On : February 16, 2023 / 12:05 PM IST

Philippines Earthquake : వరుస భూకంపాలతో ఇప్పటికే టర్కీ, సిరియాలు కకావికలం అయిపోయాయి. భూకంపాలతో రెండు దేశాల్లోను 41,000మందికిపైగా మరణాలు నమోదు అయ్యాయి. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. ఈక్రమంలో బుధవారం న్యూజిలాండ్‌లో భూకంపం సంభవించింది రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదైంది. ఇదిలా ఉంటే గురువారం (ఫిబ్రవరి 16,2023) ఫిలిప్పీన్స్‌లో భూకంపం సంభవించింది. ఇలా వరుస భూకంపాలు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాయి.

ఫిలిప్పీన్స్‌లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 6.1గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం..గురువారం తెల్లవారుఝామున 2 గంటల ప్రాంతంలో ఫిలిప్పీన్స్ లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది అని అమెరికా జియోలాజికల్‌ సర్వే (USGS) వెల్లడించింది. మస్బేట్ లోని మస్బేట్‌ (Masbate) ప్రావిన్స్‌లోని మియాగా (Miaga) గ్రామానికి 11 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్‌జీఎస్‌ వెల్లడించింది.

కాగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో భూకంపాలు భయపెడుతున్నాయి. టర్కీ, సిరియాలో ఇంకా భూకంప శిథిలాల నుంచి కోలుకోనేలేదు. వారం దాటినా ఇంకా శిథిలాల నుంచి పలువురు ప్రాణాలతో బయటపడుతున్నారు. ఈ భూకంపాలకు రెండు దేశాల భూభాగాల్లో కలిపి ఇప్పటి వరకు 41వేల మందికి పైగా ప్రజలు మృతి చెందారు. ఓ పక్క శిథాలాల నుంచి ఎంతోమందిని రెస్క్యూటీమ్ కాపాడుతున్నారు. మరోపక్క శవాల గుట్టల మధ్యే ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విపత్తు నుంచి టర్కీ, సిరియాలో ఎప్పటికి కోలుకుంటాయో కూడా చెప్పలేని పరిస్థితి.