Parents selling children : పిల్లల్ని కనటం అమ్మటం..అదే భార్యాభర్తల వ్యాపారం

పిల్లల్ని అమ్మటానికిే కంటున్నారు భార్యాభర్తలు. అదే వారి వ్యాపారం. బిడ్డ కడుపులో ఉండగానే బేరాలుకుదుర్చుకోవటం ప్రసవం కాగానే అమ్మేయటం ఆ భార్యాభర్తల వ్యాపారంగా చేసుకున్నారు.

Parents selling children : పిల్లల్ని కనటం అమ్మటం..అదే భార్యాభర్తల వ్యాపారం

Parents Selling Children

Updated On : December 20, 2021 / 4:50 PM IST

Chinese man sold his children : చంటిపిల్లల అమ్మకాలు అత్యంత దారుణంగా మారుతున్నాయి. కన్నబిడ్డల్నే అంగడిలో సరుకుల్లా అమ్మేస్తున్న ఘటనలు కోకొల్లలు. కొంతమంది పెంచలేక..మరికొంతమంది డబ్బుల కోసం అమ్మేస్తున్నారు. కానీ పిల్లల్ని అమ్మటానికే కంటున్నారు ఆ భార్యాభర్తలు. అదొక వ్యాపారంగా మారింది ఆ దంపతులకు. పిల్లల్ని అమ్మి డబ్బులు సంపాదిస్తున్నారు. అదో వ్యాపారంగా మార్చేశారు. భార్య పిల్లల్ని కనటం భర్త అమ్మేయటం ఇదే పని వారికి. అలా వారు ఐదురుగురు పిల్లల్ని కని అమ్మేశారు. పిల్లల్ని కనే యంత్రంగా భార్య..వాటిని అమ్మే వ్యాపారిగా భర్త. అంత్యంత అమానవీయంగా పిల్లల్ని అమ్మేయటానికి కంటున్న ఈ భార్యాభర్తల గుట్టు రట్టు అయ్యింది. కోర్టు వీరికి కఠిన శిక్ష విధించింది. భర్తకు 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు అతనికి సహకరిచిన వారికి కూడా శిక్ష ఖరారు చేసిన ఘటన చైనాలో జరిగింది. చైనా హెబే రాష్ట్రంలో భార్యాభర్తలు ఇద్దరు పిల్లల్ని కనటం అమ్మేయటం చేస్తున్న విషయం పోలీసులకు తెలిసి..వారిని కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తు సదరు తండ్రికి 10 ఏళ్ల జైలుశిక్ష విధించింది.

Read more : China’s New Law : చైనాలో కొత్త చట్టం…పిల్లలు తప్పు చేస్తే పెద్దలకు శిక్ష!

హెబే యాంగ్ అనే వ్యక్తి డబ్బు కోసం ఐదుగురు పిల్లలను 28,275డాలర్లకు(రూ.21 లక్షల 42వేలు) అమ్మేశాడు. విచారణ అనంతరం యూ కౌంటీ కోర్టు ఇతనికి 10ఏళ్ల జైలు శిక్ష
విధించింది. పిల్లలను అమ్మేందుకు సహకరించిన మరో ఇద్దరికి కూడా శిక్ష ఖరారు చేసింది. యాంగ్​. అతని భార్య పేరు యువాన్​. 2012-2020 మధ్య వీరిద్దరు తమకు పుట్టిన ఐదుగురు పిల్లల్ని అమ్మేశారు. వీరిలో ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. యాంగ్ దంపతులు సంసారం చేయటం..యువాన్ గర్భవతి అవ్వటం..ప్రసవించాక ఆ బిడ్డను యాంగ్ అమ్మేయటం. అలా వారు బిడ్డల్ని అమ్మటానికే కంటున్నారు. అలా వారిద్దరు ఒక్కొక్క బిడ్డను రూ.2 లక్షల నుంచి రూ.9లక్షలకు అమ్మేశారు.

Read more : China Ban Viral Song : ఆసియా దేశాల్లో వైరల్ అవుతున్న పాటను బ్యాన్ చేసిన చైనా

వీరి పిల్లలను అమ్మేందుకు లీ అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించాడు. దానికి అతనికి కమిషన్ ఇస్తున్నారు యాంగ్ దంపతులు. అలా అతనికి రూ.35వేలకుపైగా ఇచ్చారు. మరో మగబిడ్డను పుట్టిన వెంటనే ఆస్పత్రిలోనే అమ్మేశారు. కనీసం ఆబిడ్డను ఒక్కరోజు కూడా పెంచలేదు. ఇలా పుట్టగానే అలా పక్క బెడ్​లో ఉన్న మహిళకు అమ్మేసారు యాంగ్ దంపతులు.ప్రసవించే సమయం దగ్గర పడుతుండగా బిడ్డ బేరం కుదుర్చుకోవటం ప్రసవం అవ్వగానే అమ్మేయటం ఇదే వారి పనిగా పెట్టుకున్నారు. కాదు కాదు వ్యాపారంగా మార్చుకున్నారు. ఈక్రమంలో యాంగ్ దంపతుల పిల్లల వ్యాపారం గురించి పోలీసులకు తెలిసింది. ఆరా తీశారు. అసలు విషయం తెలుసుకున్నారు. పక్కాగా వారిపై నిఘా వేసి మరోబిడ్డను అమ్ముతుండగా పట్టుకున్నారు. అన్ని సాక్ష్యాలు సేకరించి కోర్టులో సమర్పించారు.

Read more : China population crisis :చైనాలో పెరిగిపోతున్న‘బ్యాచిలర్స్’..పెళ్లి అంటేనే భయపడిపోతున్న అబ్బాయిలు..

ఈ నేరంలో మధ్యవర్తిగా ఉన్న లీ, అతని కోడలు డువాన్​ను కూడా దోషులుగా తేల్చింది యూ కౌంటీ న్యాయస్థానం. లీకి ఏడేళ్లు, డువాన్​కు 21నెలల జైలు శిక్ష ఖరారు చేసింది.సొంత తల్లిదండ్రులే తమ బిడ్డల్ని విక్రయించండం అత్యంత హేయమైన చర్య అని కోర్టు వ్యాఖ్యానించింది. పిల్లల్లి ప్రేమతో పెంచి పెద్ద చేయాల్సిన వారే బిడ్డల్ని వ్యాపార సరుకుల్లా చూశారని మండిపడింది.కేవలం డబ్బు సంపాదించాలనే దురాశతో కన్నబిడ్డల్ని ఇలా అమ్మేయటం అత్యంత దారుణమైన విషయం అని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేసింది. కసాయివారికి వీరికి తేడాలేదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. అలా బిడ్డల హక్కుల్ని కాలరాసినట్లేనని అన్నది.వీరిన సరైన శిక్ష విధించకపోతే ఇటువంటి వ్యాపారాన్ని ప్రోత్సహించినట్లవుతుందని కోర్టు పేర్కొంది.

Read more : China`s population policy: ముగ్గురు పిల్లలను కనడానికి చైనా అనుమతి

కాగా చైనాలో జనాభా పెరిగుతున్న క్రమంలో ‘ఒక్క బిడ్డనే కనాలని నిర్భంధ విధించింది ప్రభుత్వం. ఆ తరువాత ఇద్దరు పిల్లల్ని కనాలి తెలిపింది.ఈ నిర్ణయాలతో చైనాలో జననాల రేటు తగ్గిపోవటం..వృద్ధు పెరిగిపోవటంతో ఇటీవల కాలంలో ముగ్గురు బిడ్డల్ని కనటానికి అనుమతులు ఇచ్చింది.ఇదిలా ఉంటే చైనా ప్రజా భద్రత వివరాల ప్రకారం పిల్లల కిడ్నాప్ కేసులు 2012లో 6,000గా ఉండగా.. 2021 నాటికి ఆ సంఖ్య 666కి తగ్గినట్లు ది సౌత్ చైనా  మార్నింగ్​ పోస్ట్​ వెల్లడించింది. చైనాలో డబ్బుల కోసం పిల్లలను తల్లిదండ్రులు అమ్మేసే షాకింగ్ ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి. ఈ ఏడాది మే నెలలో దక్షిణ జెజియాంగ్ రాష్ట్రంలో జీ అనే ఓ వ్యక్తి విదేశీ పర్యటన కోసం తన రెండేళ్ల కుమారుడ్ని రూ.15లక్షలకు అమ్మేశాడు. ఇలా చాలా ఘటనలు జరుగుతుంటాయి.