మరో షాకింగ్ : చైనా వెళ్లకపోయినా కరోనా వస్తుంది

మరో షాకింగ్ : చైనా వెళ్లకపోయినా కరోనా వస్తుంది

Updated On : February 9, 2020 / 3:10 AM IST

ఓ ట్యాక్సీ డ్రైవర్.. టెంపరరీ కార్ డ్రైవర్‌లు కరోనా వైరస్ కు గురయ్యారు. వారితో కలిపి సింగపూర్ లో ఏడు కరోనా కేసులు నమోదయ్యాయని సింగపూర్ ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. వారిలో ఏ ఒక్క వ్యక్తి ఇటీవలి కాలంలో చైనా వెళ్లలేదు.. రాలేదు. వాళ్లు ట్యాక్సీ డ్రైవర్లు.. వృత్తిలో భాగంగా ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చడమే వారి పని. వాళ్ల వయస్సు ఒకరిది 64, మరొకరు 53.

ఈ మేరకు ఆరోగ్య శాఖ ఇలా చెప్పింది. ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చడమే కాదు. ఆ సమయంలో ఆరోగ్యంపైనా జాగ్రత్త తీసుకోవాలని అంది. ఈ ఇద్దరితో సంబంధమున్న వ్యక్తుల్లోనే కరోనా సోకిన ఐదుగురు ఉన్నారు. వాళ్లకెలా వచ్చిందో తెలుసుకుందాం..

52ఏళ్ల మహిళ. పాయా లెబర్ ప్రాంతంలో ఉండే ద లైఫ్ చర్చ్ అండ్ మిషన్స్ సింగపూర్‌కు వెళ్లింది. అక్కడే ఆమెకు కరోనా వైరస్ సోకిన ఇతర పేషెంట్ల తాకిడి కారణంగా కరోనా అంటుకుంది. మిగిలిన కేసుల్లోనూ ఇంతే..

40 ఏళ్ల మహిళ, 36ఏళ్ల మహిళ ఇద్దరు యాంగ్ థాయ్ హంగ్‌లో ఉద్యోగస్థులు. మెడికల్ షాపులకు పేషెంట్లను తీసుకురావడమే వారి పని. 

38 ఏళ్ల మహిళ జనవరి 25 నుంచి 28వరకూ.. 51ఏళ్ల మలేసియాకు చెందిన వ్యక్తితో కలిసి బిజినెస్ మీటింగ్ కోసం గ్రాండ్ హయత్ సింగపూర్ కు వచ్చింది. అక్కడే వైరస్ సోకిన ముగ్గురిని కలిసింది. 109కంపెనీల నుంచి 94 విదేశీయులు, 15మంది స్థానికులు హాజరయ్యారు. అదే మీటింగ్.. ఫ్రాన్స్, బ్రిటన్, దక్షిణ కొరియా, మలేసియా నుంచి వచ్చిన కరోనా పేషెంట్లు ఉన్నారు. 

మీటింగ్ ముగిసిన తర్వాత ఆయా దేశాలకు వెళ్లిన వారు 40మందికి ఈ వైరస్ అంటించారట. కేవలం ముఖానికి మాస్క్‌లు ధరిస్తే సరిపోదని, తాకిడి కారణంగానూ వైరస్ అంటుకునే ప్రమాదాలు ఉన్నాయని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ చెప్పింది.