Amazon డెలివరీ బాయ్‌కు కరోనా

Amazon డెలివరీ బాయ్‌కు కరోనా

Updated On : March 4, 2020 / 5:53 AM IST

ఆన్‌లైన్ రిటైలర్ అమెజాన్.కామ్ కోసం పనిచేస్తున్న ఉద్యోగి మంగళవారం కరోనా వైరస్ బారిన పడ్డాడు. అమెరికాలో పనిచేస్తున్న వ్యక్తికి కరోనా సంక్రమించినట్లు అధికారులు తేల్చారు. ‘కరోనా సోకిన వ్యక్తికి మా వంతు సపోర్ట్ ఇస్తున్నాం’ అని ఆ కంపెనీ అధికార ప్రతినిధి వెల్లడించారు. (కరోనా వైరస్ సోకిందని..భార్యను ఏం చేశాడో తెలుసా?)

దీంతో ఆ వ్యక్తితో కలిసి పనిచేసిన ఉద్యోగులకు, అతని సహచరులకు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. వైరస్ సోకిన వ్యక్తిని ఐసోలేషన్ వార్డులో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సీటెల్‌లో ఉన్న సౌత్ లేక్ యూనియన్ ఆఫీస్‌లోని ఎంప్లాయీస్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇదే కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తుల్లో మిలాన్‌లో, ఇటలీలో ఇద్దరు వైరస్ సోకిందని తెలిపారు అధికారులు. 

అమెరికాలో కరోనా టీకాలు: కరోనాను నియంత్రించేందుకు టీకా తయారీ చేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. పది పాపులర్ ఫార్మా కంపెనీల సీఈవోలతో వైట్‌హౌ్‌సలో భేటీ అనంతరం ఈవిషయాన్ని వెల్లడించారు. టీకా తయారీకి ప్లానింగ్‌తో ముందుకుసాగాలని సూచించారు. టీకా అభివృద్ధిలో ఇతర దేశాలతో కలిసి పనిచేస్తామని ట్రంప్‌ తెలిపారు.