America : 16 మంది పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి 690 ఏళ్ల జైలుశిక్ష!

మాథ్యూ జాక్ జివిస్కీ ఓ డేకేర్ సెంటర్ లో 16 మంది అబ్బాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ కేసులో అతడిగా దోషిగా తేల్చారు.

America : 16 మంది పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి 690 ఏళ్ల జైలుశిక్ష!

American Convict jail

America Convict Jail : అమెరికాలో 16 మంది పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ వ్యక్తికి భారీ శిక్ష పడనుంది. కాలిఫోర్నియాకు చెందిన వ్యక్తికి సుమారు 34 నేరాభియోగాల్లో దోషిగా తేలాడు. దీంతో ఈ కేసులో అతనికి సుమారు 690 ఏళ్ల జైలు శిక్ష పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్ 17వ తేదీన ఆ కేసులో శిక్షాకాలాన్ని వెల్లడించనున్నారు.

34 ఏళ్ల మాథ్యూ జాక్ జివిస్కీ ఓ డేకేర్ సెంటర్ లో 16 మంది అబ్బాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ కేసులో అతడిగా దోషిగా తేల్చారు. 16 మంది అబ్బాయిలను లైంగికంగా వేధించడంతో పాటు ఒక అబ్బాయికి అసభ్యకరమైన వీడియోలను చూపించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Cops Harass Woman : కాబోయే భర్తతో పార్కుకు వెళ్లిన యువతి…పోలీసుల లైంగిక వేధింపులు

ఈ కేసులో ఆరెంజ్ కౌంటీ జిల్లా అటార్నీ తీర్పును వెల్లడించారు. మొత్తం 34 నేరాల్లో అతన్ని దోషిగా తేల్చారు. తన లైంగిక కోరికలను తీర్చుకునేందుకు మగ పిల్లల్ని తీవ్రంగా వేధించినట్లు మాథ్యూపై ఆరోపణలు ఉన్నాయి.

2014 జనవరి 1వ తేదీ నుంచి 2019మే 17వ తేదీ మధ్య కాలంలో అతడు ఆగడాలకు పాల్పడ్డాడు. అయితే 34 కేసులకు సంబంధించి 2023 నవంబర్ 17వ తేదీ జైలు శిక్షా కాలాన్ని కోర్టు వెలువరించనుంది. అన్ని కేసులు కలిపితే అతనికి సుమారు 690 ఏళ్లపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.