World Records: 187 క్యాండీ కేన్లను గడ్డానికి గుచ్చి.. ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి..
ప్రపంచం క్రిస్మస్ జరుపుకోనున్న వేళ అమెరికాకు చెందిన ఓ వ్యక్తి తనలోని అసాధారణ ప్రతిభను ప్రదర్శించి గిన్నిస్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.

American Man
Special Candy Canes: గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకోవడానికి చాలామంది తహతహలాడతారు. వారిలోని అసాధారణ ప్రతిభను వెలికి తీస్తుంది ఆ ఆశ. ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టడమే జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారు కొందరు.
మరికొన్ని రోజుల్లో ప్రపంచం క్రిస్మస్ జరుపుకోనున్న వేళ అమెరికాకు చెందిన ఓ వ్యక్తి తనలోని అసాధారణ ప్రతిభను ప్రదర్శించి గిన్నిస్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. అమెరికాకు చెందిన జోయెల్ స్ట్రాసర్ అనే వ్యక్తి క్రిస్మస్ స్పిరిట్‌తో గడ్డాన్ని పెంచాడు. తాజాగా 187 క్యాండీ కేన్లను తన గడ్డంలో దూర్చి గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టాడు.
ఈ రికార్డును బద్దలు కొట్టడానికి జోయెల్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. క్రిస్మస్ సీజన్‌లోనే గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకోవాలని భావించాడు. గత ఏడాది క్రిస్మస్ సీజన్ లోనూ జోయెల్ తన ముఖంపై 710 క్రిస్మస్ బాబుల్స్ ను పెట్టుకుని తన రికార్డును తానే బద్దలు కొట్టాడు.
ఇప్పుడు మరో వినూత్న ప్రయత్నం చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. గడ్డం, ముఖంతో రికార్డులను బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను గిన్నిస్ బుక్ పోస్ట్ చేసింది.
View this post on Instagram
Lionel Messi : మెస్సీనా మజాకానా.. 6 జెర్సీలకు రూ.64 కోట్లు