Chidren Video: 1,200 అడుగుల ఎత్తులో గాల్లో ఆరుగురు చిన్నారులు మరో ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు

దాదాపు 5 గంటలుగా తమ ప్రాణాలు గాల్లోనే ఉన్నాయని అందులోని వ్యక్తి చెప్పాడు.

Chidren Video: 1,200 అడుగుల ఎత్తులో గాల్లో ఆరుగురు చిన్నారులు మరో ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు

Cable Car

Chidren Video – Pakistan: పాకిస్థాన్‌లోని ఓ ప్రాంతంలో ఆరుగురు చిన్నారులు మరో ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు గాల్లో ఉన్నాయి. భగవంతుడా రక్షించు అంటూ ఆ పిల్లలు, వారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ (Khyber Pakhtunkhwa province)లోని కొండల మధ్య నుంచి స్కూలుకి వెళ్లేందుకు విద్యార్థులు చైర్‌లిఫ్టును వాడుతుంటారు.

రోజులాగే ఇవాళ లోయను దాటేందుకు చైర్‌లిఫ్టు ఎక్కారు. అందులో మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే, అది కొద్ది దూరం వెళ్లాక కేబుల్ పాడై మధ్యలోనే చైర్‌లిఫ్టు ఇరుక్కుపోయింది. దాదాపు 1,200 అడుగుల (365 మీటర్లు) ఎత్తులో అది ముందుకు వెళ్లక, వెనక్కి రాకుండా ఉండిపోయింది.

అందులో ఇరుక్కుపోయిన గల్ఫజ్ అనే వ్యక్తి పాకిస్థాన్ టెలివిజన్ ఛానెల్ జియో న్యూస్ తో ఫోనులో మాట్లాడుతూ తమను రక్షించాలని వేడుకున్నాడు. దాదాపు 5 గంటలుగా తమ ప్రాణాలు గాల్లోనే ఉన్నాయని చెప్పాడు.

ఇప్పటికే చైర్‌లిఫ్టులోని ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడని అన్నాడు. ఓ హెలికాఫ్టర్ వచ్చినప్పటికీ తమను కాపాడలేకపోతోందని చెప్పాడు. కేబుల్ కార్ కి ఒకే ఒక్క రోప్ ఉందని అధికారులు అంటున్నారు. వారికి కాపాడేందుకు పాక్ ఆర్మీ నానా తిప్పలు పడుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Dawn Today (@dawn.today)

Insomnia : నిద్ర పట్టకపోవడానికి కారణాలివే.. సమస్యను అంత ఈజీగా తీసుకోవద్దు