Insomnia : నిద్ర పట్టకపోవడానికి కారణాలివే.. సమస్యను అంత ఈజీగా తీసుకోవద్దు

మనం బయటకు ఏది చెప్పకున్నా.. మనసులో, మెదడులో కొన్ని ఆలోచనలు తిరుగుతుంటాయి. అవి కాలక్రమేణా ఒత్తిడికి గురి చేస్తుంటాయి. దీనివల్ల కూడా నిద్రలేమి సమస్య వస్తుంది. ఆ ఒత్తిడి తట్టుకోలేక హృదయం బలహీనపడుతుందని బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ కూడా చెబుతున్నది.

Insomnia : నిద్ర పట్టకపోవడానికి కారణాలివే.. సమస్యను అంత ఈజీగా తీసుకోవద్దు

insomnia

Insomnia : ఆకలి రుచెరుగదు.. నిద్ర సుఖమెరుగదు.. అంటారు. కానీ ఇప్పుడు మనకు సౌకర్యాలు పెరిగాయి గానీ నిద్ర సుఖం మాత్రం ఉండటం లేదు. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇలా నిద్రకు సంబంధించిన సమస్యల వెనుక కారణాలేంటో తెలుసుకుంటే సమస్యను అధిగమించవచ్చు. అవేంటో ఇలా చెబుతున్నారు వైద్య నిపుణులు.

READ ALSO : Tiger Nuts : డయాబెటిస్ నియంత్రణలో ఉంచే టైగర్ నట్స్ !

నిద్ర పట్టకపోవడం అనే సమస్యను అంత ఈజీగా తీసుకోవద్దు. ఇదొక రుగ్మత కిందే లెక్క కట్టాలి. నిద్ర అందరూ పోతారు.. కానీ నాణ్యమైన నిద్ర లేకపోతే మీరు ఎంత సేపు పడుకున్నా అది నిష్ర్పయోజనమే. నిద్రలేమి సమస్య  రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంది. అంతేకాదు.. ఇలా నెలలుగా కొనసాగితే మాత్రం మీకు కొత్త కొత్తఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. నిద్రపట్టకపోవడానికి కూడా కొన్ని కారణాలుండొచ్చు.ఈ కింద సమస్యలు మిమ్మల్ని బాధిస్తున్నాయో లేదో ఒకసారి వైద్యుడిని సంప్రదించి తెలుసుకోండి.

READ ALSO : kidney Stones : కాఫీ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందా లేదా తగ్గుతుందా?

డయాబెటిస్..

మీకు షుగర్ ఉందా? ఏంటి మీ పేస్ట్ లో ఉప్పుందాఅన్నట్లుఅడిగామనుకున్నారా? అయితే మీరు టైప్ 2 మధుమేహ బాధితులైతే మీకు నిద్రలేమి సమస్య ఉంటుందని అంటున్నారు వైద్యులు. ఎందుకంటే మాములగా షుగర్ వ్యాధి ఉన్నవారిలో తరుచూమూత్రవిసర్జన చేసే సమస్య ఉంటుంది.దీనికారణంగా రాత్రి సమయంలో ఎక్కువసార్లుబాత్రూమ్ ఉపయోగిస్తుంటారు. శరీరంలో అదనపు గ్లూకోజ్ ఉన్నప్పుడు మీ కణజాలాల నుంచి నీటిని తీసుకుంటుంది. ఇది కూడా శరీరాన్ని నిర్జీవం చేస్తుంది. అందువల్ల కూడా సరిగా నిద్రపట్టకపోవచ్చు. అలాగే ఒంట్లో తక్కువ చక్కెర నిల్వలు ఉన్నా కూడా నిద్ర సమస్య బాధిస్తుంది.

READ ALSO : Diabetes : ఈ ఆహారాలు డయాబెటిస్ ను అదుపులో ఉంచుతాయట ! అవేంటో తెలుసా ?

ఒత్తిడి..

మనం బయటకు ఏది చెప్పకున్నా.. మనసులో, మెదడులో కొన్ని ఆలోచనలు తిరుగుతుంటాయి. అవి కాలక్రమేణా ఒత్తిడికి గురి చేస్తుంటాయి. దీనివల్ల కూడా నిద్రలేమి సమస్య వస్తుంది. ఆ ఒత్తిడి తట్టుకోలేక హృదయం బలహీనపడుతుందని బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ కూడా చెబుతున్నది. ఈ ఒత్తిడి వల్ల రక్తపోటు పడిపోయి స్ట్రోక్ కి కారణమవుతుంది. అంతేకాదు.. ఊపిరితిత్తుల చుట్టూ ద్రవం పేరుకొని రాత్రి పూట శ్వాస ఆడక చాలాసార్లులేవాల్సి ఉంటుంది. ఇది కూడా నిద్రలేమికి కారణమవుతుంది.

READ ALSO : ఎముకలు, కండరాలకు మేలు చేసే చికెన్ లివర్

ఆర్థరైటిస్..

కీళ్లనొప్పులు, వాపులు మనం మేల్కొని ఉన్నప్పుడే కాదు.. పడుకున్నప్పుడు కూడా బాధిస్తుంటాయి. ఈ ఆర్థరైటిస్ సమస్య విపరీతంగా ఉన్నప్పుడు చికిత్స అవసరం. వాటికోసం వాడే మందులు అంటే స్టెరాయిడ్స్ వల్ల కూడా నిద్రలేమి సమస్య ఎదురవచ్చు.

కిడ్నీ సమస్య..

రక్తంలో మిగిలిపోయిన ద్రవాలు నిద్రలేమి సమస్యకు కారణమవుతాయి. ఇవే మూత్రపిండాల సమస్యలకు దారితీస్తాయి. చీలమండల వాపులు, వికారం, ఊపిరి ఆడకపోవడం, మూత్రంలో రక్తం కనిపించడం ఈ పరిస్థితి లక్షణాలుగా పరిగణించాలి. ముఖ్యంగా వృద్ధులలో దీర్ఘకాలిక సమస్యలు జీవన నాణ్యతను తగ్గిస్తాయని గుర్తు పెట్టుకోండి.

READ ALSO : Radish : మూత్రపిండాలు, లివర్ ఆరోగ్యానికి ముల్లంగి

థైరాయిడ్..

హైపోథైరాయిడిజంనిద్రలేమి సమస్యను పెంచుతుంది. అవయవాల పని తీరును కూడా ప్రభావితం చేస్తుంది. కీళ్లు, కండరాల నొప్పిని కలిగిస్తుంది. నాడీ వ్యవస్థను ఎక్కువగా ప్రేరేపిస్తుంది. భయాందోళనలు కలిగేలా చేసి నిద్ర పట్టనివ్వదు.

ఇవి కాకుండా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, టీవీ.. ఇలా అన్ని కూడా నిద్రలేమికి కారణమవుతాయి. వాటిని కూడా దూరం పెట్టాలి. మెదడు, ఇతర అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే మంచి నిద్ర చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి.