మీరు మైండ్‌లో అనుకుంటే చాలు.. అక్షరాల్లోకి మార్చేసే ఏఐ.. అందుబాటులోకి రాబోతున్న వినూత్న టెక్నాలజీ..!

మీ మైండ్‌లోని ఆలోచనలను అక్షరాల్లోకి మార్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందుబాటులోకి రాబోతోంది. ఈ మేరకు సరికొత్త టెక్నాలజీని ఆస్ట్రేలియా పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు.

మీరు మైండ్‌లో అనుకుంటే చాలు.. అక్షరాల్లోకి మార్చేసే ఏఐ.. అందుబాటులోకి రాబోతున్న వినూత్న టెక్నాలజీ..!

Australian researchers

Updated On : June 18, 2025 / 10:29 AM IST

Australian Researchers: మీ మైండ్‌లోని ఆలోచనలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో అక్షరాల్లోకి మార్చే సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రాబోతోంది. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు దీనిని అభివృద్ధి చేస్తున్నారు. త్వరలో ఇది అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వినూత్న టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. మన మైండ్‌లోని ఆలోచనలను ఏఐ ద్వారా అభివృద్ధి అవుతున్న టెక్నాలజీ అక్షరాల్లోకి మార్చేస్తుంది.

 

బ్రెయిన్ వేవ్స్ ను పదాల్లోకి తర్జుమా చేసేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం మెదడు ఆరోగ్యాన్ని తెలుసుకునేందుకు వైద్యులు ఉపయోగిస్తున్న ఎలక్ట్రోఎన్ సెఫలోగ్రామ్ (ఈఈజీ)ని ఉపయోగించి ఆలోచనలను అక్షరాల్లోకి మార్చేలా ఏఐని తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఈ ఏఐ టెక్నాలజీ బ్రెయిన్ వేవ్స్ ను డీకోడ్ చేసి చిన్నచిన్న పదాలను రాస్తోందని సిడ్నీ యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు.

ఈఈజీ ద్వారా గ్రహించిన బ్రెయిన్ వేవ్స్ ను డీకోడ్ చేసి పదాల్లోకి మార్చేలా ఈ ఏఐ టెక్నాలజీని ఆస్ట్రేలియా పరిశోధకులు తీర్చిదిద్దుతున్నారు. ప్రయోగంలో భాగంగా.. పరిశోధనలో గైడ్ గా వ్యవహరిస్తున్న డాక్టర్ లియాంగ్ ఈ పరిశోధనలో పాలుపంచుకున్నాడు. అతని మెదడులోని ఆలోచనలను గ్రహించిన సరికొత్త ఏఐ టెక్నాలజీ వాటిని అక్షరాల్లోకి మార్చి చూపింది. అయితే, ప్రస్తుతానికి ఈ టెక్నాలజీ చిన్నచిన్న పదాలను మాత్రమే డీ కోడ్ చేసి టెక్స్ రూపంలో అందిస్తుంది.

ప్రస్తుతం ఆస్ట్రేలియా పరిశోధకులు నూతన టెక్నాలజీని మరింత అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమయ్యారు. కొద్దిరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని, పూర్తిస్థాయిలో మైండ్‌లోని ఆలోచనలకు అక్షరరూపమిచ్చే వినూత్న టెక్నాలజీని అందుబాటులోకి తెస్తామని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మరోవైపు.. ఎలాన్ మస్క్ కు చెందిన న్యూరాలింక్ కంపెనీ శాస్త్రవేత్తలుకూడా ఇదే తరహా ప్రాజెక్టును అభివృద్ధిచేసే పనిలో నిమగ్నమయ్యారు.