Joe Biden Viral Pic : షర్టు లేకుండా జో బైడెన్ .. హాలీవుడ్ యాక్షన్ హీరోలా పోజులు

రష్యా అధ్యక్షుడు పుతిన్,అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఏమాత్రం తీసిపోనట్లుగా జో బైడెన్ షర్టు లేకుండా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వైలర్ అవుతున్నాయి.

Joe Biden Viral Pic : షర్టు లేకుండా జో బైడెన్ .. హాలీవుడ్ యాక్షన్ హీరోలా పోజులు

Joe Biden Shirtless Pics

Joe Biden Viral Pic In beach : అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ (Joe Biden)నడుస్తు నడుస్తు కిందపడిన ఫోటోలు, మతిమరుపుతో పేర్లు మార్చి మార్చిన సందర్భాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కానీ 80 ఏళ్ల వయసులో షర్టు లేకుండా జోబైడెన్ పోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బేస్ బాల్ క్యాప్ పెట్టుకుని, కళ్లజోడు ధరించి హాలీవుడ్ యాక్షన్ హీరోలా పోజుల్లో కనిపిస్తున్న బైడెన్ ఫోటోలు వైరల్ గా మారాయి.

రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) గుర్రంపై షర్టులేకుండా ఇచ్చిన పోజులకు ధీటుగా అమెరికా పెద్దన్న ఫోటోలు ఉన్నాయంటున్నారు నెటిజన్లు. హాలివుడ్ యాక్షన్ హీరో సిల్వెస్టర్ స్టాలోన్ (Sylvester Stalin)లెక్క బైడెన్ పోజుల్లో భలే గమ్మత్తుగా ఉన్నారు.  డెలావేర్ ఇంటికి (Delaware home)సమీపంలోని రెహోబోత్ బీచ్ (Rehoboth beach)లో బైడన్ సరదాగా కాసేపు ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన క్యాప్, షర్టు లేకుండా, ఓన్లీ షార్ట్ తో ఉన్న ఫొటోను అక్కడే ఉన్న ఒక జర్నలిస్ట్ క్యాప్చర్ చేసి ఆయనే ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తు..రెహోబోత్ బీచ్ (Rehoboth beach)లో ప్రెసిడెంట్ అద్భుతమైన బీచ్ డే ను ఎంజాయ్ చేస్తున్నారని ఫొటోకు క్యాప్షన్ పెట్టారు.

Indian Woman Missing : క్రూయిజ్ షిప్‌లో భారతీయ మహిళ అదృశ్యం

కాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇలాంటి పలు ఫొటోలు వైరల్ అయ్యాయి. పుతిన్ షర్ట్ లేకుండా, కండలు తిరిగిన శరీరంతో హార్స్ రైడింగ్ చేస్తున్న పుతిన్ ఫొటో ఈనాటికి ఒక సెన్సేషనే అనే చెప్పాలి. ఈక్రమంలో పెద్దన్న కూడా నేనేమీ తగ్గేదేలేదన్నట్లుగా తాజా ఫోటోలున్నాయి. అలాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు కూడా ఏమాత్రం తగ్గేదేలేదన్నట్లుగా బైడెన్ ఫోటోలున్నాయి. గతంలో హాలీవుడ్ సూపర్ స్టార్ సిల్వెస్టర్ స్టాలిన్ బాడీకి తన తలను జోడించిన ఫొటోను గతంలో ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.