Bill Gates with Sal Khan : సల్మాన్ ఖాన్ ఐడియా ఉంది.. సల్ ఖాన్ ఎవరో తెలుసా..? క్లారిటీ ఇచ్చిన బిల్ గేట్స్..!

సల్మాన్ ఖాన్.. సల్ ఖాన్.. వీరిద్దరు భిన్న రంగాలకు చెందిన వ్యక్తులు.. పేర్లు వినగానే మాత్రం కన్ఫ్యూజ్ అవుతాం. ఇదే ప్రశ్న బిల్ గేట్స్ సల్ ఖాన్‌ను అడిగారు.. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే?

Bill Gates with Sal Khan : సల్మాన్ ఖాన్ ఐడియా ఉంది.. సల్ ఖాన్ ఎవరో తెలుసా..? క్లారిటీ ఇచ్చిన బిల్ గేట్స్..!

Bill Gates with Sal Khan

Updated On : August 16, 2023 / 3:26 PM IST

Bill Gates with Sal Khan : మైక్రో సాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రీసెంట్‌గా ఖాన్ అకాడమీ ఫౌండర్ సల్ ఖాన్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ‘మీరు ఎప్పుడైనా సల్మాన్ ఖాన్‌తో కన్ఫ్యూజ్ అయ్యారా?’ అంటూ చమత్కారంగా అడిగారు. అందుకు సల్ ఖాన్ ఏం చెప్పారంటే?

Bill Gates: నా తండ్రి మరణంతో నిద్ర విలువ తెలిసొచ్చింది.. రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో చెప్పిన బిల్ గేట్స్

బిల్ గేట్స్ రీసెంట్‌గా ‘అన్ కన్ఫ్యూజ్ మీ’ అనే పోడ్‌కాస్ట్ ప్రారంభించారు. రెండవ ఎపిసోడ్‌లో ఖాన్ అకాడమీ వ్యవస్థాపకుడు సల్ ఖాన్‌ను ఆహ్వానించారు. ఖాన్ అకాడమీ లాభాపేక్ష లేని అమెరికన్ విద్యా సంస్థ. విద్యార్దులకు ఉచిత ఆన్‌లైన్ విద్యను అందించడంలో సాయం చేస్తుంది. సల్ ఖాన్‌తో బిల్ గేట్స్ ఇంటర్వ్యూ జరిపిన సమయంలో అనేక అంశాలపై మాట్లాడారు. అయితే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఫోటో పట్టుకుని బిల్ గేట్స్ సల్ ఖాన్‌ను ఓ ఫన్నీ క్వశ్చన్ అడిగారు. ‘మీరు సల్ ఖాన్ అని వెబ్ సెర్చ్ చేస్తే ఈ వ్యక్తిని కనుగొనవచ్చు. మీరు ఎప్పుడైనా సల్మాన్ ఖాన్ పేరుతో కన్ఫ్యూజ్ అయ్యారా?’ అని నవ్వుతూ అడిగారు.

అందుకు సల్ ఖాన్ తాను నిజంగానే కన్ఫ్యూజ్ అయినట్లు చెప్పారు.  ఖాన్ అకాడమీ మొదలైన రోజుల్లో ‘తనను ప్రేమిస్తున్నానని.. మీకు మ్యాథ్స్ కూడా వచ్చా మాకు తెలియదు’ అని సల్మాన్ అభిమానుల నుంచి లెటర్స్ వచ్చినట్లు సల్ ఖాన్ చెప్పారు. సల్ ఖాన్ సమాధానికి బిల్ గేట్స్ గట్టిగా నవ్వారు. అంతేకాదు 2015 లో ఇండియా వెళ్లినపుడు ఓ టీవీ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ తో వేదిక పంచుకున్నాను అని సల్ ఖాన్ గుర్తు చేసుకున్నారు.

Bill Gates: పౌలా హర్డ్ తో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ డేటింగ్

ఇంకా ఈ పోడ్‌కాస్ట్ టైంలో గేట్స్ మరియు ఖాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తోంది? AI యుగంలో టీచర్లు పరిస్థితి ఏంటి? మొదలైన  అంశాలపై చర్చించారు. అంతేకాదు వారు చదువుకున్న స్కూళ్లు, ఇష్టమైన ఉపాధ్యాయుల గురించి మాట్లాడుకున్నారు.