ఇండియాతో పాటు 91దేశాలకు తక్కువ ధరకే కరోనా వ్యాక్సిన్ అందాలని బిల్ గేట్స్ భారీ విరాళం

బిల్ గేట్స్ లక్షల మందికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. మహమ్మారితో అమెరికా తీవ్రంగా నష్టపోయింది. ప్రపంచమంతా ఇదే పరిస్థితి. ఈ క్రమంలో ఒకవేళ కరోనా వ్యాక్సిన్ వచ్చినా దానిని కొనుగోలు చేసి వాడుకునేంత స్తోమత అందరిలోనూ ఉండదని భావించి బిల్ గేట్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన చేసిన ప్రకటనలో వచ్చే ఏడాది నాటికి ప్రపంచంలోని నిరుపేదలందరికీ వ్యాక్సిన్ అందేందుకు తన వంతుగా 150 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు.
అంటే అక్షరాలు 1125 కోట్ల రూపాయలకు పైనే. కరోనావైరస్ కోసం ఇచ్చిన విరాళాలన్నింటిలో ఇదే అత్యంత ఎక్కువ. ఈ మొత్తాన్ని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ కు ఇవ్వనున్నారు. ఫలితంగా 100మిలియన్ డోసులు ప్రొడ్యూస్ చేయనుంది. ఒకొక్క దాని ఖరీదు కేవలం 3డాలర్లు మాత్రమే.
‘కేవలం రిచ్ దేశాల్లో మాత్రమే కాకుండా వైరస్ కు ముగింపు పలికేందుకు ప్రయత్నిస్తున్నాం. అని గేట్స్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. డెవలపింగ్ వరల్డ్ కోసం వ్యాక్సిన్లు తయారుచేయించడానికి తాను సిద్ధంగా ఉన్నానని బిల్ గేట్స్ అంటున్నారు. ఆస్ట్రా జెనెకా, నోవావ్యాక్స్ ఫార్మాసూటికల్ కంపెనీలు తక్కువ ఖరీదుకే వ్యాక్సిన్ అందేలా ఉత్పత్తి చేస్తున్నారు.
బిల్ గేట్స్ తన బ్యాంక్ అకౌంట్ ను అప్పగించేసి 150మిలియన్ డాలర్ల వరకూ ఖర్చు చేసుకోవచ్చని చెప్పారట. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఇండియా కోసం వ్యాక్సిన్లు తయారుచేస్తుంది. ఇండియాకు మాత్రమే కాకుండా 91 మిడిల్ ఇన్‌కమ్ దేశాలకు వ్యాక్సిన్ అందించనున్నారు. కరోనా నిర్మూలన కోసం మొత్తం గేట్ ఫౌండేషన్ 500 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది.