యాప్ సాయంతో 5K రన్ పూర్తి చేసిన 50ఏళ్ల అంధుడు

యాప్ సాయంతో 5K రన్ పూర్తి చేసిన 50ఏళ్ల అంధుడు

Updated On : November 22, 2020 / 10:50 AM IST

50 సంవత్సరాల వయస్సున్న అంధుడు ఓ యాప్ సాయంతో 5కే రన్ లో పాల్గొన్నాడు. ఎటువంటి పెంపుడు జంతువు, మరో వ్యక్తి సాయం లేకుండానే పరుగును పూర్తి చేశాడు. కేవలం స్మార్ట్ ఫోన్ కు ఇయర్ ఫోన్స్ తగిలించి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా సాధించాడు.

‘కదలకుండా ఒక చోటనే ఉండటం ఇష్టం ఉండదని’ థామస్ పానెక్ చెప్తున్నాడు. ఇతనికి 20ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడే కంటి చూపు కోల్పోయాడట. జన్యుపరమైన సమస్యల కారణంగా కంటిచూపు కోల్పోయినా 50ఏళ్ల వయస్సులోనూ పరిగెత్తగలననే నమ్మకాన్ని కోల్పోలేదు.



పక్కనే ఓ గైడ్ ఉంచుకుని పరిగెత్తడం ప్రాక్టీస్ చేయడం విసుగు అనిపించదట. అందుకే ఒంటరిగా మారథాన్ లో పాల్గొనాలని సంవత్సరం క్రితమే ఫిక్స్ అయ్యాడు. అంతే గూగుల్ సెర్చింగ్ ద్వారా ఫాలో అయిపోతున్నాడు.

గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ తో కలిసి రీసెర్చ్ ప్రోగ్రాంలోనూ పనిచేశాడు. స్మార్ట్ ఫోన్ కెమెరా రన్నింగ్ ట్రాక్ పై పెయింటెడ్ గైడ్ లైన్ ఉన్నట్లు చూపిస్తుంది. రన్నర్ పొజిషన్ ను పసిగట్టి ఎటువైపుగా నడవాలో గైడెన్స్ ఇస్తుంది.

ఇది అచ్చం ఓ పిల్లాడికి టీచర్ పాఠం చెప్తున్నట్లుగా జరుగుతుందని గూగుల్ రీసెర్చర్ గ్జువాన్ యాంగ్ అంటున్నారు. ఈ రీసెర్చ్ కు మహమ్మారి కోసం అమల్లోకి వచ్చిన సోషల్ డిస్టెన్సింగ్ బాగా ఉపయోగపడిందట.

ఇంత వరకూ సాధించడం చాలా ఎమోషనల్ గా ఉంది. యాప్ టెస్ట్ చేయడం చాలా ఆనందంగా ఉందని గూగుల్, న్యూయార్క్ రోడ్ రన్నర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన క్లబ్ లో థామస్ పానెక్ చెప్పాడు. ‘ఈ ఫీలింగ్ కేవలం స్వేచ్ఛ, స్వాతంత్ర్యం మాత్రమే కాదు. అందరిలానే సెన్స్ అవగలుగుతుండటం గ్రేట్ గా అనిపిస్తుంది’ అని సంబరపడిపోతున్నాడు.