Pakistan’s Quetta: క్వెట్టాలో బాంబు పేలుడు.. నలుగురు మృతి, 15మందికి గాయాలు

పాకిస్తాన్‌లోని క్వెట్టా ప్రావిన్స్‌లో గురువారం(30 డిసెంబర్ 2021) రాత్రి బాంబు పేలుడు సంభవించింది.

Pakistan’s Quetta: క్వెట్టాలో బాంబు పేలుడు.. నలుగురు మృతి, 15మందికి గాయాలు

Pakisthan

Updated On : December 31, 2021 / 6:39 AM IST

Pakistan’s Quetta: పాకిస్తాన్‌లోని క్వెట్టా ప్రావిన్స్‌లో గురువారం(30 డిసెంబర్ 2021) రాత్రి బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నలుగురు మృతి చెందగా, 15 మంది తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ క్వెట్టా సివిల్ ఆసుపత్రిలో చేర్చారు. పేలుడు ధాటికి సమీపంలోని భవనాల అద్దాలు పగిలిపోయాయి.

జిన్నా రోడ్డులోని సైన్స్ కళాశాల సమీపంలో పార్క్ చేసిన కారులో పేలుడు సంభవించిందని అధికారులు వెల్లడించారు. జిన్నా రోడ్ క్వెట్టా ప్రధాన మార్గాలలో ఒకటి కాగా.. ఇది షాపింగ్ జరిగే అత్యంత రద్దీ ప్రాంతం. ఈ ఘటన వెనుక ఎవరున్నారు అనే విషయాలను అధికారులు ఆరా తీస్తున్నారు.

పాకిస్తాన్‌లోని ఈ ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ చాలా చురుకుగా ఉంది. ఈ ఏడాదిలోనే ఘటనా స్థలానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఫోర్ స్టార్ హోటల్ సరీనా వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ బాంబు పేలుడు కారణంగా ఐదుగురు చనిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఈ ప్రావిన్స్‌పై తాలిబాన్, ఐఎస్ ప్రభావం ఉంది.

COVID 19 Cases: ముంబై, ఢిల్లీలో భారీగా కరోనా కేసులు.. మూడో వేవ్‌కి సంకేతమా?