London: ఏడాదిలో 7 గురు నవజాత శిశువులను దారుణంగా చంపిన బ్రిటీష్ నర్సు

శిశువులను సంరక్షించే ఓ నర్సు దారుణానికి ఒడిగట్టింది. 7 గురు చిన్నారులను హత్య చేసింది. మరో ఆరుగురిపై హత్యాయత్నం చేసింది. నేరం రుజువు కావడంతో విచారణలో ఆమె దోషిగా తేలింది.

London: ఏడాదిలో 7 గురు నవజాత శిశువులను దారుణంగా చంపిన బ్రిటీష్ నర్సు

London

Updated On : August 19, 2023 / 1:24 PM IST

London: హాస్పిటల్‌లో నవజాత శిశువులను సంరక్షించే ఓ నర్సు 7 గురు పసిగుడ్డులను పొట్టన పెట్టుకుంది. వారికి ఎక్కువ మోతాదులో పాలు పట్టించి, విషపూరితమైన ఇంజెక్షన్లు ఇచ్చి దారుణంగా చంపేసింది. ఏడాది కాలంగా విచారణలో ఉన్న ఈ కేసులో నర్సును దోషిగా తేలుస్తు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

Imran Khan Wife : పాక్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ సంచలన లేఖ

లండన్‌లోని హాస్పిటల్ నియోనాటల్ యూనిట్‌లో పనిచేసే బ్రిటీష్ నర్సు లూసీ లెట్బీ ఏడుగురు నవజాత శిశువులను హత్య చేయడం మరో ఆరుగురిపై హత్యాయత్నానికి ప్రయత్నించడం సంచలనం రేపింది. ఈ కేసులో ఆమెను దోషిగా తేలుస్తూ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఏడాది కాలంగా విచారణలో ఉన్న ఈ కేసులో మాంచెస్టర్ క్రౌన్ కోర్టులోని జ్యూరీ 22 రోజులు పాటు సుదీర్ఘంగా విచారించి తీర్పును వెలువరించింది.

 

అనారోగ్యంతో ఉన్న నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు గాలిని ఇంజెక్ట్ చేసి, వారికి ఎక్కువ పాలు తాగించి, విషపూరితమైన ఇన్సులిన్‌లు ఇచ్చి చిన్నారులను చంపినట్లు లూసీ లెట్బీ ఆరోపణలు ఎదుర్కుంది. జూన్ 2015 నుండి జూన్ 2016 మధ్య హాస్పిటల్ యూనిట్‌లో శిశువుల వరుస మరణాల నేపథ్యంలో ఆమెను అరెస్టు చేశారు. శిశువు చనిపోయిన ప్రతి సందర్భంలో లూసీ లెట్బీ షిప్ట్‌లో ఉన్నట్లు సహోద్యోగులు గమనించారు. ఆమెను రెండుసార్లు విడుదల చేసినప్పటికీ 2020 లో అరెస్టు తర్వాత నిర్బంధంలో ఉంచారు.

Nuclear Weapons : ఉత్తర కొరియా అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోంది…యూఎన్ సంచలన నివేదిక

లెట్బీ మాత్రం ఉద్దేశపూర్వకంగా ఏ శిశువుకి హాని చేయలేదని విచారణలో చెప్పింది. శిశువులకు హాని కలగకుండా చూసుకున్నానని చెప్పుకొచ్చింది. అయితే ఆమె ఇంటిని పోలీసులు సోదా చేసిన సమయంలో ‘నేను వారిని పట్టించుకునేంత మంచిదానిని కానందున నేను వారిని ఉద్దేశపూర్వకంగా చంపాను’ అనే ఆమె చేతి రాతలను పోలీసులు కనుగొన్నారు. ఆమె తనపై విశ్వాసం కోల్పోయి తనను తాను నిందించుకుందని ఆమె తరపు న్యాయవాది ఆ రాతను సమర్ధించారు. నలుగురు సీనియర్ డాక్టర్లు ఆసుపత్రిలో జరిగిన తప్పిదాలను కప్పిపుచ్చడానికి తనపై నిందలు మోపడం.. ఆమెను విధులనుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్లనే లూసి లెట్బీ ఈ దారుణానికి పాల్పడిందని తెలుస్తోంది.