ఆ జాతి కుక్కలు కరోనాను గుర్తించగలవట..!

లాక్‌డౌన్ తర్వాత కొన్ని రాష్ట్రాలు రీ ఓపెన్ కు సిద్ధం అవుతున్నాయి. ఇన్ఫెక్షన్ ద్వారా సోకే ఈ జబ్బు నుంచి జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో అసలు వ్యాధి ఉన్నవారిని, లేనివారిని గుర్తిస్తే సమస్య మరింత సులువు అయిపోతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అత్యంత శక్తివంతమైన ముక్కులు.. అంటే వాసన చూసే గుణంలో లాబ్రాడర్ జాతి కుక్కలు టాప్.
పెన్సిల్వానియా యూనివర్సిటీ ఓ 8కుక్కలపై స్టడీ జరుపుతోంది. ఈ canines వైరస్ వాసనలు పసిగట్టగలుగుతాయా అనే కోణంలో పరిశోధన జరుపుతున్నారు. ఎయిర్‌పోర్టుల్లో, వ్యాపార సంస్థల్లో, హాస్పిటల్లో వైరస్ ఉన్న వ్యక్తులను గుర్తించడానికి ఈ టెక్నిక్ వాడుతున్నారు. SARS-CoV-2ను లాబ్రడర్ బ్రీడ్ గుర్తించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఇవి డ్రగ్స్, పేలుడు పదార్థాలు, నిషేదించిన ఆహార పదార్థాల వంటి వాసనలు పసిగడతాయి. వీటితో పాటు మలేరియా, క్యాన్సర్ లను బ్యాక్టీరియా ఆధారంగా గుర్తించవచ్చు. ‘ఈ వైరస్‌కు వాసన ఉంటుందో లేదో మాకు సరిగా తెలియదు. వైరస్ రెస్పాన్స్, దాని కాంబినేషన్ కూడా అర్థం కావడం లేదు’ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాధి నియంత్రణ శాఖ హెడ్ జేమ్స్ లాగన్ మాట్లాడుతూ.. ఇది సక్సెస్ అయితే వైరస్ ను కనుగొనడానికి కొత్త టూల్ కనుగొన్నట్లే అవుతుందని అంటున్నారు.
కొద్ది వారాల్లోనే మా నిపుణులు కొవిడ్-19 శాంపుల్స్ సేకరించడం మొదలుపెడతారు. చారిటీ మెడికల్ డిటెక్షన్ కుక్కలను ట్రైనీలుగా వాడుతున్నారు. ఇది సక్సెస్ అయితే యునైటెడ్ కింగ్‌డమ్ ఎయిర్‌పోర్టులో 6కుక్కలను ఉంచాలని ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో కుక్క గంటకు 250మంది వరకూ పరిశీలించగలదు.