చైనాకు రుణాలు ఇవ్వడం ఆపండి…వరల్డ్ బ్యాంక్ పై ట్రంప్ ఫైర్

చైనాకు వరల్డ్ బ్యాంక్ అప్పులు ఇవ్వడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైర్ అయ్యారు. డబ్బులు పుష్కలంగా ఉన్న చైనాకు ప్రపంచబ్యాంకు అప్పులు ఇవ్వడమేమిటని వరల్డ్ బ్యాంక్ ను ట్రంప్ ప్రశ్నించారు. ప్రపంచబ్యాంకు ఎందుకు చైనాకు అప్పులెందుకిస్తోంది. అసలు ఇది సాధ్యమేనా. చైనా దగ్గర కావాల్సినంత సంపద ఉంది. ఒకేవేళ లేకపోయినా..వారు డబ్బును సృష్టించగలరు. ఆపేయండి అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.
2025వరకు చైనాకు ఏటా ఒక బిలియన్ నుంచి 1.5 బిలియన్ డాలర్లు రుణం ఇవ్వాలని ప్రపంచ బ్యాంకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే ఈ విధానం పట్ల అమెరికా ప్రభుత్వం తొలి నుంచీ అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. అమెరికా ఆశించిన స్థాయిలో చైనాకు అందుతున్న రుణాల్లో కొత పడటంలేదని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమయంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది. కొంతకాలంగా ఇరుదేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి స్వస్తి పలికే దిశగా ఓ పాకిక్ష ఒప్పందం రూపకల్పన దిశగా వాషింగ్టన్,బీజింగ్ మధ్య చర్చలు జరుగుతన్న సమయంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ట్రంప్ పాలకవర్గంలోని మరో సీనియర్ అధికారి స్టీవెన్ మ్నుచిన్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. చైనా దీర్ఘకాలిక ప్రాజెక్టులకు రుణ సదుపాయం కల్పించవద్దని అంతర్జాతీయ సంస్థలను కోరినట్లు హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్ కమిటీకి గురువారం వివరించారు.
మరోవైపు ప్రపంచ బ్యాంక్ కూడా ఇతర దేశాలతో ప్రపంచ బ్యాంక్‌కు ఉన్న ఒప్పందం ప్రకారం ఇప్పటికే చైనా రుణాల్లో కోతలు పడుతున్నాయని తెలిపింది. దేశాల ఆర్థిక స్థితి మెరుగపడే కొద్దీ వాటికి అందే రుణాల్లో తాము కోత వేస్తున్నామని వరల్డ్ బ్యాంకు తెలిపింది. 2017లో ప్రపంచబ్యాంక్ చైనాకు 2.4 బిలియన్ డాలర్లు ఇవ్వగా..2019లో ఈ మొత్తం 1.3 బిలియన్ డాలర్లకు చేరింది.