మ్యాన్ హోల్ లో క్రాకర్స్ పెట్టాడంతే : క్షణాల్లో భారీ పేలుడు
ప్రపంచ దేశాలన్నీ న్యూ ఇయర్ వేడుకలను డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకున్నాయి. చైనీస్ కూడా న్యూ ఇయర్ వేడుకులను ట్రెడిషినల్ గా ఫైర్ క్రాకర్లతో సెలబ్రేట్ చేసుకున్నారు.

ప్రపంచ దేశాలన్నీ న్యూ ఇయర్ వేడుకలను డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకున్నాయి. చైనీస్ కూడా న్యూ ఇయర్ వేడుకులను ట్రెడిషినల్ గా ఫైర్ క్రాకర్లతో సెలబ్రేట్ చేసుకున్నారు.
ప్రపంచ దేశాలన్నీ న్యూ ఇయర్ వేడుకలను డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకున్నాయి. చైనీస్ కూడా న్యూ ఇయర్ వేడుకులను ట్రెడిషినల్ గా ఫైర్ క్రాకర్లతో సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రమాదకరమైన టపాసులను పేల్చడంలో జాగ్రత్తలు పాటించాలి. కొంతమంది ఆకతాయిలు తుంటరి చేష్టలు చేసి ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటారు. చైనాలో ఓ కుర్రాడు.. పైర్ క్రాకర్లతో న్యూ ఇయర్ వేడుకులు జరుపుకున్నాడు.
అప్పుడే అతడికి ఓ చెత్త ఐడియా తట్టింది. మ్యాన్ హోల్ లో ఎందుకు క్రాకర్స్ పేల్చకూడదు. అంతే ఆలోచనను ఆచరణలో పెట్టాడు. రోడ్డుపై టపాసులు పేల్చుకుంటు వెళ్తూ మధ్యలో మ్యాన్ హోల్ ల్లో ఫైర్ క్రాకర్లకు నిప్పు అంటించి అందులో వేశాడు. అంతే.. క్షణాల్లో మ్యాన్ హోల్ భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. మ్యాన్ హోల్ సైడ్ వాక్ ప్లోర్ బద్దలైంది. ఊహించని ఘటనతో షాకైన ఆ కుర్రాడు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు.
టపాసులతో ఆట ప్రమాదకరమని తెలిసినా.. తుంటరితనంతో చేసిన పనికి చైనా కుర్రాడు చచ్చేంత పని అయింది. పేలుడు శబ్దంతో చుట్టుపక్కల వారంతా ఉలికిపడ్డారు. ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనీస్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన క్షణాల్లోనే టన్నుల కామెంట్లు, వేలాది లైకులు వచ్చాయి. వైరల్ అవుతున్న వీడియో ఇదే..