Bajrang Punia Wins Gold In CWG 2022 : కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్.. రెజ్లింగ్‌లో భజరంగ్ పూనియాకు స్వర్ణం

కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో గోల్డ్ మెడల్ దక్కింది. రెజ్లింగ్ లో భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా దుమ్మురేపాడు. భారత్ కు గోల్డ్ మెడల్ అందించాడు.

Bajrang Punia Wins Gold In CWG 2022 : కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్.. రెజ్లింగ్‌లో భజరంగ్ పూనియాకు స్వర్ణం

Updated On : August 5, 2022 / 11:07 PM IST

Bajrang Punia Wins Gold In CWG 2022 : ఇంగ్లండ్ బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. దేశానికి పతకాల పంట పండిస్తున్నారు. విశ్వ క్రీడా వేదికపై మువ్వెన్నల జెండాను రెపరెపలాడిస్తున్నారు.

తాజాగా కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో గోల్డ్ మెడల్ దక్కింది. రెజ్లింగ్ లో భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా దుమ్మురేపాడు. భారత్ కు గోల్డ్ మెడల్ అందించాడు. 65 కేజీల విభాగం ఫైనల్లో ప్రత్యర్థిని ఓడించి స్వర్ణాన్ని ముద్దాడాడు. దీంతో కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ పతకాల సంఖ్య 23కి పెరిగింది.

మరోవైపు భజరంగ్ పూనియా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కామెన్ వెల్త్ గేమ్స్ లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. టోక్యో ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించిన అతడు.. మూడుసార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచాడు.

పురుషుల ఫ్రీస్టైల్‌ 65 కేజీల విభాగంలో తలపడిన పూనియా.. కెనడాకు చెందిన లాచలాన్ మెక్‌నీల్‌ను 2-9 పాయింట్ల తేడాతో ఓడించి బంగారు పతకం సాధించాడు. 2014 కామన్‌వెల్త్ క్రీడల్లో సిల్వర్‌ మెడల్‌తో సరిపెట్టుకున్న ఈ 28 ఏళ్ల స్టార్ రెజ్లర్‌.. 2018లో వేల్స్‌కు చెందిన కేన్‌ చారిగ్‌ను ఓడించి స్వర్ణం సాధించాడు. ఈసారి మళ్లీ తన మ్యాజిక్‌ రిపీట్ చేసి స్వర్ణం తన ఖాతాలో వేసుకున్నాడు.

 

పునియాపై ప్రధాని ప్రశంసలు: