Congo : మార్కెట్ లో తెగిపడ్డ కరెంట్‌తీగలు..24మంది మహిళలతో సహా 26మంది మృతి..
రద్దీగా ఉండే మార్కెట్లో హై వోల్టేజ్ కరెంట్ తీగలు తెగి పడి 24మంది మహిళలతో సహా 26మంది దుర్మరణం పాలయ్యాయి.మార్కెట్ లో సరుకులు కొనుక్కుని బస్సు కోసం ఎదురు చూస్తుండగా ఈ దారుణం జరిగింది.

Power Cable Collapse At Kinshasa Market Dead 26
Power cable collapse at Kinshasa market Dead 26 : చావు ఎలా వస్తుందో తెలియదు. పోయే రోజు వస్తే చేతి తాడే పామై కాటేస్తుందని పెద్దలు చెబుతుంటారు. మృత్యువు పొంచి ఉంటే చెట్టు కింద నిలబడితే చిన్నకొమ్మ విరిగి పడి కూడా ప్రాణాలు పోవచ్చు. ఇలా ప్రాణం పోవటానికి ఎన్నో కారణాలు. మరెన్నో హేతువులు.
అటువంటిదే జరిగింది మధ్య ఆఫ్రికా దేశం కాంగోలో. అత్యంత ఘోరం జరిగింది. రద్దీ మార్కెట్ సమీపంలో పిడుగుపాటుకు హై వోల్టేజ్ కేబుల్ తెగిపడి 26 మంది దుర్మణం చెందారు. కాంగో రాజధాని కిన్‌షాసా శివారులో బుధవారం (ఫిబ్రవరి 3,2022) విద్యుత్ తీగలు తెగి పడి 26మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురించేసింది. తీవ్ర విషాదాన్ని నింపింది.
మృతుల్లో 24 మంది మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారని, మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ప్రభుత్వ ప్రతినిధి పాట్రిక్ ముయాయా ట్విట్టర్‌లో తెలిపారు. 13 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న కిన్షాసాలో విద్యుత్ తీగలు తరచుగా కూలిపోతున్నాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోవటానికి కారణమవుతున్నాయి.
భారీ వర్షాలు, వరదల కారణంగా.. నాలా వ్యవస్థ దెబ్బతిని నీరు రోడ్ల మీదకు చేరుకుంది. ఆ సమయంలో మార్కెట్ దగ్గర్లోని బస్సు కోసం కొందరు ఎదురు చూస్తుండగా.. హఠాత్తుగా వైర్ తెగిపడి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో 24 మంది మహిళలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. భారీ తుపాను సమయంలో పిడుగుపాటు సంభవించిందని జాతీయ విద్యుత్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ వారి కుటుంబాలకు సానుభూతి తెలిపింది.