మరణమృదంగం : క్యా కరోనా..3 వేల 98 మంది మృతి

చైనాలో పుట్టిన కరోనా.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది.. ఇక ఇటలీలో కరోనా మరణ మృదంగా వాయిస్తోంది.. తాజాగా ఆ దేశంలో 133 మంది మృతి చెందారు. ఒక్కరోజులోనే 1 వేయి 247 కేసులు పాజిటివ్‌గా తేలాయి. ఈ నేపథ్యంలో లొంబార్టీ, మిలాన్ నగరాలు, పరిసర ప్రాంతాల్లో ప్రజల కదలికలపై కఠిన ఆంక్షలు విధించారు. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ 366 మంది చనిపోయారు.
ఇరాన్‌లో : –
మరోవైపు ఇరాన్ లోనూ కరోనా విజృంభిస్తోంది. ఆ దేశంలో ఒక్క రోజే 49 మంది మృతి చెందారు. కోవిడ్-19 కారణంగా దేశంలో గత 24 గంటల్లో 49 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో కరోనాతో ఇప్పటివరకు 194 మంది ప్రాణాలు కోల్పోయారు. 6566 మంది కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇరాన్‌లో అక్కడా, ఇక్కడా అని కాకుండా మొత్తం 31 ప్రావిన్సులకు కరోనా పాకింది. తన ప్రభావం చూపుతోంది.
చైనాలో : –
ఇక చైనాలో కరోన మృతుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.. తాజాగా 28 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3వేల 98కి చేరింది.. కరోనాతో బాధపడుతున్న వారు 80వేల మంది ఉన్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా 104 దేశాలకు కరోనా వ్యాపించింది. ఈ వ్యాధి బారిన 1లక్షా 9వేల 823 మంది పడినట్లు తెలుస్తోంది.. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 3వేల 804 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
భారత్‌లో : –
భారత్ లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. కరోనా కేసులు 39కి పెరిగాయి. దేశంలోనే తొలిసారిగా కరోనా కేసు నమోదైన కేరళలో మరోసారి కరోనా కలవరం రేపుతోంది. ఇవాళ ఒక్కరోజే కేరళలో కొత్తగా 5 కరోనా పాటిజివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గింస్తోంది. దీంతో భారత్ లో నిన్నటి వరకు 34 వరకే ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నేటికి 39కి చేరింది.
కేరళలో : –
కేరళలో మరోసారి కరోనా కన్నెర్ర జేసింది. వూహాన్ నుంచి ముగ్గురు వైద్య విద్యార్థులకు కరోనా వైరస్ సోకడంతో ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందించి డిశ్చార్జ్ చేసిన తర్వాత మళ్లీ కరోనా కలకలం రేపింది. కేరళలో మరో ఐదుగురికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబీకులు కావడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం వారిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
కేరళ ప్రభుత్వం అప్రమత్తం :-
కేరళకు చెందిన బాధితుల్లో ముగ్గురు ఇటీవలే ఇటలీకి వెళ్లి తిరిగి వచ్చారు. వీరితో పాటు కాంటాక్టులో ఉన్న మరో ఇద్దరు కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. అయితే ఇటలీ నుంచి తిరిగి వచ్చినా తర్వాత ఎయిర్ పోర్టులోని హెల్ప్ డెస్క్ కు కానీ, సమీపంలోని ఆస్పత్రికి గానీ బాధితులు రిపోర్టు చేయలేదని కేరళ ప్రభుత్వం అంటుతోంది. జ్వరం, జలుబు లక్షణాలు బయటపడటంతో వారిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా కొత్త కేసులతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. వారితో కాంటాక్టులో ఉన్నవారిని గుర్తించడంపై దృష్టి పెట్టారు. ఆ ఐదుగురితోపాటు విమానంలో ప్రయాణించిన వారు కూడా తక్షణమే రిపోర్టు చేయాలని సూచించింది.
మరోవైపు ఉత్తరప్రదేశ్ లో 6, ఢిల్లీలో 3, కేరళలో 3, జమ్మూకాశ్మీర్ లో 3, తెలంగాణ, తమిళనాడులో ఒక్కొక్కరితోపాటు 16 మంది ఇటలీ పర్యాటకులకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో దేశంలో ఇప్పటివరకు 39 కరోనా కేసులు నమోదు అయ్యాయి.