బ్రిటన్ ప్రధానిని హెచ్చరించాడు… కోవిడ్-19కి తానే బలైయ్యాడు
UK లో కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన ఒక వైద్యుడు మరణించాడు. ఆరోగ్య కార్యకర్తలకు అత్యవసరంగా వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ) ఎక్కువ అవసరమని ప్రధానిని హెచ్చరించిన మూడు వారాల తరువాత అతను మరణించాడు.

UK లో కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన ఒక వైద్యుడు మరణించాడు. ఆరోగ్య కార్యకర్తలకు అత్యవసరంగా వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ) ఎక్కువ అవసరమని ప్రధానిని హెచ్చరించిన మూడు వారాల తరువాత అతను మరణించాడు.
UK లో కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన ఒక వైద్యుడు మరణించాడు. ఆరోగ్య కార్యకర్తలకు అత్యవసరంగా వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ) ఎక్కువ అవసరమని ప్రధానిని హెచ్చరించిన మూడు వారాల తరువాత అతను మరణించాడు. ఆసుపత్రిలో కోవిడ్ -19 తో 15 రోజులపాటు పోరాడి అబ్దుల్ మాబుద్ చౌదరి (53) కన్నుమూశారు.
UK లోని ప్రతి NHS కార్మికుడికి PPEని అత్యవసరంగా సమకూర్చాలని మార్చి 18 న అతను బోరిస్ జాన్సన్‌కు ఒక సందేశాన్ని రాశారు. ఆరోగ్య కార్యకర్తలు రోగులతో ప్రత్యక్ష సంబంధంలో ఉన్నారని, వ్యాధి లేకుండా తమ కుటుంబం మరియు పిల్లలతో జీవించడానికి ఈ ప్రపంచంలో ఇతరుల మాదిరిగానే మానవ హక్కు ఉందని ఆయన ప్రధానికి చెప్పారు.
డాక్టర్ చౌదరి లోక్యూమ్ యూరాలజిస్ట్, అతను తూర్పు లండన్‌లోని హోమెర్టన్ హాస్పిటల్‌లో పనిచేశాడు. రోమ్‌ఫోర్డ్‌లోని క్వీన్స్ హాస్పిటల్‌లో పరీక్షించిన తరువాత కరోనావైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో బుధవారం మరణించాడు.
ముస్లిం వైద్యుల సంఘం ఒక ప్రకటనలో ఆయనకు నివాళి అర్పించింది. హోమర్టన్ ఆసుపత్రిలో కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ అబ్దుల్ మాబుద్ చౌదరి COVID-19తో పోరాడి మృతి చెండడం తమకు చాలా బాధ కల్గించదని ఆవేదన వ్యక్తం చేశారు. అతను తన భార్య, ఇద్దరు పిల్లలను వదిలివెళ్లాడు.. కానీ తమ ఆలోచనలు, ప్రార్థనలు వారితో ఉన్నాయని తెలిపారు. ఆసుపత్రిలో చేరే రెండు వారాల ముందు, మంచి పిపిఇ కోసం అతను ప్రధానమంత్రికి సందేశం రాశాడని గుర్తు చేశారు. అతనికి శాంతి లభించుగాక అని కోరుకున్నారు.
దయచేసి UK లోని ప్రతి NHS ఆరోగ్య కార్యకర్తలకు అత్యవసరంగా PPE ఉండేలా చూసుకోవాలని డాక్టర్ చౌదరి.. ప్రధానమంత్రికి రాసిన సందేశంలో పేర్కొన్నారు. వైద్యులు / నర్సులు / హెచ్‌సిఎలు / అనుబంధ ఆరోగ్య కార్యకర్తలు రోగులతో ప్రత్యక్ష సంబంధం కలిగివున్నారని గుర్తుంచుకోవాలన్నారు. కానీ వ్యాధి లేని ప్రపంచంలో కుటుంబం, పిల్లలతో జీవించేందుకు తమకు కూడా ఇతరుల మాదిరిగానే మానవ హక్కులు ఉన్నాయని తెలిపారు.
లేకపోతే భవిష్యత్తులో తమ పిల్లలు మెడికల్ స్కూలుకు వెళ్ళడానికి ఆసక్తి చూపరని చెప్పారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రోగులకు సహాయపడటానికి కరోనావైరస్ పరీక్ష కోసం తాము మొదటి ట్రాక్ సౌకర్యాలు కూడా ఉండాలన్నారు.(‘అమ్మా వచ్చేయమ్మా’…నర్సును చూసి బిడ్డ కన్నీరు..చలించిన కర్నాటక సీఎం)
కరోనావైరస్ UK కి చేరుకోవడానికి చాలాకాలం ముందు నుంచే డాక్టర్ చౌదరి ఆందోళన చెందుతున్నారని అతని కుటుంబ స్నేహితుడు డాక్టర్ గోలం రహత్ ఖాన్ చెప్పారు. కరోనావైరస్ చాలా ప్రమాదకరమని తనకు, ఇతర స్నేహితులకు చెప్పేవారని రహత్ ఖాన్ చెప్పాడు. దాదాపు 20 సంవత్సరాలుగా డాక్టర్ చౌదరితో పరిచయం ఉన్న డాక్టర్ ఖాన్ (45), అతను జీవితాన్ని ప్రేమించే వ్యక్తి అని చెప్పాడు.
డాక్టర్ చౌదరికి పాడటం అంటే ఇష్టం, స్వంత బెంగాలీ సంస్కృతిని ఇష్టపడ్డాడు మరియు ఆంగ్ల వారసత్వాన్ని ఇష్టపడ్డాడని డాక్టర్ ఖాన్ తెలిపారు. అతను చాలా శ్రద్ధగలవాడు, తన ఇంటికి రావాలని తరచుగా మమ్మల్ని పిలిచేవాడని చెప్పారు. ఫిబ్రవరి 1 న తన కొడుకు ఎనిమిదవ పుట్టినరోజు కోసం డాక్టర్ చౌదరి తన ఇంటికి వచ్చినప్పుడు అతన్ని చివరిసారిగా చూశానని డాక్టర్ ఖాన్ తెలిపారు. ఎన్‌హెచ్‌ఎస్ సిబ్బంది జాబితాలో కరోనా మహమ్మారితో పోరాడుతూ డాక్టర్ చౌదరి మృతి చెందడం తాజా ఘటనగా చెప్పవచ్చు.